యాప్నగరం

షాకింగ్! తెలంగాణలో 332కు చేరిన కరోనా కేసులు.. ఒక్కరోజే 62

Coronavirus cases in Telangana: హైదరాబాద్‌లో అత్యధికంగా 145 కేసులను గుర్తించగా, తర్వాతి స్థానంలో వరంగల్ అర్బన్ జిల్లా ఉంది. ఇక్కడ మొత్తం 23 కరోనా కేసులను గుర్తించారు. తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ (19), నల్గొండ (13), మేడ్చల్ (12), ఆదిలాబాద్ (10), కామారెడ్డి (8), కరీంనగర్ (6) ఉన్నాయి.

Samayam Telugu 5 Apr 2020, 11:10 pm
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకే రోజులో రాష్ట్రంలో 62 కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 332 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ రాత్రి పది గంటల సమయంలో హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 32 మంది పూర్తిగా కోలుకున్నట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 289 మాత్రమే ఉన్నాయి. ఇక కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 11గా ఉంది. ఆదివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను ప్రకటించారు.
Samayam Telugu EU2GdADUMAIhDeP


Must Read: కరోనా చీకట్లను చీల్చిన దీపాలు.. ప్రముఖుల ఇళ్లలో ఇలా..

హైదరాబాద్‌లో అత్యధికంగా 139 కేసులను గుర్తించగా, తర్వాతి స్థానంలో వరంగల్ అర్బన్ జిల్లా ఉంది. ఇక్కడ మొత్తం 23 కరోనా కేసులను గుర్తించారు. తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ (19), నల్గొండ (13), మేడ్చల్ (12), ఆదిలాబాద్ (10), కామారెడ్డి (8), కరీంనగర్ (6) ఉన్నాయి.

Also Read: సంగారెడ్డి కరోనా పేషెంట్లకు రెండు రోజుల్లోనే నెగటివ్

Also Read: మందు పార్టీతో రెవెన్యూ సిబ్బంది మజా.. లాక్‌డౌన్ వేళ మిట్టమధ్యాహ్నం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.