యాప్నగరం

మక్కాలో కరోనాతో తెలంగాణ వాసి మృతి.. కడచూపు కరువే!

Makkah: మక్కాలో నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ బారినపడి మరణించాడు. అతడు 35 ఏళ్లుగా మక్కాలో నివాసం ఉంటుండగా.. భార్య తెలంగాణలో, నలుగురు పిల్లలు సౌదీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు.

Samayam Telugu 17 Apr 2020, 1:47 pm
రోనా కల్లోలం కొనసాగుతోంది. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కోవిడ్-19 బారినపడి మక్కాలో మరణించాడు. ఈ విషయాన్ని సౌదీ ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 16) వెల్లడించింది. నిజామాబాద్ పట్టణంలోని అహ్మద్‌పురా కాలనీకి చెందిన అజ్మతుల్లా ఖాన్ (65) 35 ఏళ్లుగా మక్కాలో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. బింద్‌లాడెన్ గ్రూప్‌ ఆఫ్ కంపెనీస్‌లో పనిచేస్తున్నారు. గత మంగళవారం ఆయన ఆయన జ్వరంలో ఆస్పత్రిలో చేరారు. ఆయనలో జ్వరం తప్ప ఇతర లక్షణాలేవీ కనిపించలేదని వైద్యులు వెల్లడించారు. అజ్మతుల్లా ఖాన్ అస్వస్థతకు గురైన విషయాన్ని వెంటనే ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఖాన్ భార్య తెలంగాణలో ఉండగా.. ఆయన నలుగురు సంతానం సౌదీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu nizamabad man death
నమూనా చిత్రం


పరిస్థితి విషమించడంతో అజ్మతుల్లా ఖాన్ గురువారం చికిత్స పొందుతూ మరణించినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. మరణించిన తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఖాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణించిన సమాచారం తెలియడంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు.

Don't Miss: అమెరికా ఆస్పత్రుల్లో పేరుకుపోతున్న మృతదేహాలు.. షాకింగ్ ఫోటోలు

చివరి చూపు చూసే అవకాశం కల్పించాలని అజ్మతుల్లా ఖాన్ కుటుంబసభ్యులు కోరుతున్నారు. కానీ, కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడం, వాయు మార్గాన్ని పూర్తిగా మూసేసిన ప్రస్తుత తరుణంలో ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఇటీవల ఏపీకి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లోమరణించగా.. తోటి ఉద్యోగులే అంత్యక్రియలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోను కుటుంబసభ్యులకు పంపించారు. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న వేళ ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల పుణేకు చెందిన ఓ వ్యక్తి కూడా మదీనాలో అకస్మాత్తుగా మరణించాడు. మదీనాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి తాను కరోనా బారిన పడినట్లు గుర్తించకపోవడం విషాదకరం. చనిపోయిన తర్వాత అతడు కరోనా వైరస్ బారినపడినట్లుగా అధికారులు నిర్ధారించారు.

Photo Credit: Dawn

Also Read: చికిత్స కోసం గుంటూరు వెళ్తే ప్రాణం మీదకు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.