యాప్నగరం

ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా; రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనుకుంటే..

నారాయణపేట జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 32కు చేరింది.

Samayam Telugu 11 Jul 2020, 8:41 am
పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు 20 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉండటం గమనార్హం. నారాయణపేట పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడితో కాంటాక్ట్ అయిన 17 మంది శాంపిళ్లను సేకరించి టెస్టులు చేయగా.. 9 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
Samayam Telugu covid
Representative image


మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8 మందికి, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరికి, గద్వాలలో ఒకరికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో మహబూబ్‌నగర్‌ డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులతోపాటు.. టీబీ హాస్పిటల్‌లో పనిచేసే సూపర్‌వైజర్‌ కూడా ఉన్నారు.

నాగర్‌కర్నూల్‌కు చెందిన ఓ యువకుడికి ఇటీవల యాక్సిడెంట్ కాగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి అంత్యక్రియలు ముగిశాక కరోనా సోకినట్లు రిపోర్ట్ వచ్చింది. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకూ 365 కరోనా కేసులు నమోదు కాగా.. 25 మంది మరణించారు. మహబూబ్ నగర్‌లో అత్యధికంగా 164 కేసులు నమోదు కాగా.. గద్వాలలో 70, వనపర్తిలో 63, నాగర్ కర్నూల్‌లో 47, నారాయణపేటలో 32 కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.