యాప్నగరం

ఫోన్ చేసి తండ్రిని పిలిచాడు.. చూస్తుండగానే జలపాతంలోకి దూకాడు

Sirpur: ఈ క్రమంలో గురువారం తండ్రి జైరామ్‌తో కలిసి బాలుడు పొలం పనికి వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో శివ్ దాస్ తండ్రికి ఫోన్ చేసి తాను కుండాయి జలపాతంపైన ఉన్నానని.. భయంగా ఉందని చెప్పాడు. త్వరగా రా నాన్న అంటూ మాట్లాడాడు.

Samayam Telugu 29 Feb 2020, 10:40 am
కొమరం భీం జిల్లా సిర్పూర్ (యు) విషాదం జరిగింది. అప్పటి వరకు తండ్రితో కలిసి పొలంలో పని చేసిన కుమారుడు తండ్రి కళ్లముందే జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు బాగా చదివి జీవితంలో స్థిరపడి వారి కష్టాలను తీరుస్తాడునుకుంటే.. వారి కలలు ఆవిరయ్యాయని బాధితులు విలపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి గ్రామానికి చెందిన దేశ్ ముఖ్ శివ్ దాస్ అనే 15 ఏళ్ల బాలుడు పోచంలొద్ది బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇతనికి ఫిట్స్, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తండ్రి రెండు నెలల కిందట హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు.
Samayam Telugu adilabad


ఈ క్రమంలో గురువారం తండ్రి జైరామ్‌తో కలిసి బాలుడు పొలం పనికి వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో శివ్ దాస్ తండ్రికి ఫోన్ చేసి తాను కుండాయి జలపాతంపైన ఉన్నానని.. భయంగా ఉందని చెప్పాడు. త్వరగా రా నాన్న అంటూ మాట్లాడాడు. భయాందోళనకు గురైన తండ్రి జైరామ్ నలుగురితో అక్కడికి చేరుకున్నాడు. వెంటనే బాలుడు తండ్రి కళ్లముందే తన ఫోన్‌ను పక్కన పడేసి, జలపాతంలోకి దూకేశాడు.

Also Read: రాచకొండ సీపీ ఔదార్యం.. యువతికి మందురాసి, కట్టు కట్టి.. నెటిజన్ల పొగడ్తలు

ఈతగాళ్లతో పాటు పోలీసులు చుట్టుపక్కల వెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు. చివరికి గజ ఈతగాళ్లను పిలిచి వెతికించగా, వారు తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కరెంటు ఛార్జీల బాదుడు.. టారీఫ్‌ల పెంపునకు సీఎం గ్రీన్ సిగ్నల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.