యాప్నగరం

చెస్ట్ ఆస్పత్రిలో ఘోరం.. ఆక్సీజన్ లేక విలవిల్లాడుతూ కొవిడ్ పేషెంట్ మృతి!

Erragadda: తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి.. ఊపిరి అందడం లేదని, గుండె ఆగిపోయేలా ఉందని బాధపడ్డాడు. అప్పటి వరకూ ఉంచిన వెంటిలేటర్‌ను సిబ్బంది తొలగించారని ఆరోపించాడు.

Samayam Telugu 28 Jun 2020, 5:42 pm
హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో ఘోరం జరిగింది. కరోనా వైరస్ లక్షణాలతో ఓ యువకుడు చనిపోయాడు. చనిపోకముందు తనకు ఊపిరి ఆడడం లేదని, ఆక్సీజన్ పెట్టాలని సిబ్బందిని బతిమాలినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సకాలంలో వెంటిలేటర్ పెట్టి ఉంటే యువకుడు బతికి ఉండేవాడని అంటున్నారు. హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్‌కు చెందిన యువకుడు కొద్ది రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో చేరాడు. ఇటీవల తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి.. ఊపిరి అందడం లేదని, గుండె ఆగిపోయేలా ఉందని బాధపడ్డాడు. అప్పటి వరకూ ఉంచిన వెంటిలేటర్‌ను సిబ్బంది తొలగించారని ఆరోపించాడు. దాదాపు 3 గంటల పాటు మృత్యువుతో పోరాడినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రభుత్వ ఛాతీ వ్యాధుల వైద్యశాల
chest hospital hyderabad


ఈ క్రమంలో యువకుడు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి వీడియో రికార్డింగ్‌ బయటకు రావడంతో డాక్టర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువకుడి అంత్యక్రియల్లో 30 మంది బంధువులు పాల్గొన్నట్టు సమాచారం. ఈ కార్యక్రమం తర్వాత వచ్చిన కరోనా పరీక్ష ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో స్థానికులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.

బాధితుడి తండ్రి మాట్లాడుతూ.. ఈ నెల 24న తన కుమారుడికి జ్వరం వచ్చిందని తెలిపారు. వైద్యం కోసం 11 ఆస్పత్రులు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. చివరికి ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో చేర్చుకున్నారని వివరించారు. రెండు రోజుల అనంతరం 26న అప్పటి వరకూ ఉంచిన వెంటిలేటర్ తొలగించడంతో తన కుమారుడు చనిపోయాడని తెలిపారు. తన కుమారుడికి 26 ఏళ్ల వయసు ఉందని, మరణించాకే కొవిడ్ ఉన్నట్లుగా నిర్ధారణ అయిందని వివరించారు.

Don't Miss: undefined

‘అదంతా అవాస్తవం’
ఈ వ్యవహారంపై ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాధితుడు చనిపోయాడనే వాదనను కొట్టిపారేశారు. కరోనా సోకడం వల్ల గుండెపె ఎఫెక్ట్ పడుతుందని, యువకుల్లో ఇది ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఇతని విషయంలోనూ అదే జరిగిందని, వైద్యుల నిర్లక్ష్యం ఏం లేదని చెప్పారు.

Also Read: షాకింగ్.. తెలంగాణ పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనాAlso Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.