యాప్నగరం

వీడియో: Hyd రోడ్డుపై వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. దంపతులకు సాయం చేయబోయి..

Hyderabad Weather: కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వర్షాలు అలాగే కొద్ది రోజులు కొనసాగవచ్చునని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది.

Samayam Telugu 20 Sep 2020, 10:15 pm
చైతన్యపురి సమీపంలోని తపోవన్ కాలనీ ప్రాంతంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై విపరీతమైన వరద నీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇద్దరు దంపతులు చిక్కుకుపోగా వారికి సాయం చేసే క్రమంలో ఇతను గల్లంతయ్యాడు. తపోవన్ కాలనీ ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న దంపతులు వరదలో ఇబ్బంది పడుతుంటే సాయం చేసేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతైన గుర్తు తెలియని వ్యక్తి కోసం స్థానికులు గాలిస్తున్నారు.
Samayam Telugu రోడ్డుపై నుంచి కుంటలోకి కొట్టుకుపోతున్న వ్యక్తి
Tapovan colony, saroor nagar


కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వర్షాలు అలాగే కొద్ది రోజులు కొనసాగవచ్చునని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు అతి భారీ వర్షాల ముప్పు అధికంగా ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వర్షాల ముప్పు అధికంగా ఉండే జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.