యాప్నగరం

హైదరాబాద్‌లో అడ్డంగా బుక్కైన ఛానెల్ రిపోర్టర్.. అక్రమంగా లిక్కర్ రవాణా

Telangana Lockdown Updates: చెక్ పోస్ట్ గుండా కారు వెళ్తుండగా పోలీసులు ఆపారు. కారు డిక్కీ తెరవగా అందులో మద్యం బాటిళ్లతో కూడిన పెట్టెలు ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ డాగ్, సిగ్నేచర్ వంటి మద్యం బ్రాండులను కారులో తీసుకెళ్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Samayam Telugu 13 Apr 2020, 12:23 am
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఒక న్యూస్ రిపోర్టర్ ఈ సందర్భాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్‌లో అన్ని దుకాణాలు మూసి ఉన్న వేళ మద్యానికి బాగా డిమాండ్ ఉంటోన్న సంగతి తెలిసిందే. ఇది గమనించిన ఆ రిపోర్టర్ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Must Read: undefined

బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ గుండా కారు వెళ్తుండగా పోలీసులు ఆపారు. కారు డిక్కీ తెరవగా అందులో మద్యం బాటిళ్లతో కూడిన పెట్టెలు ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ డాగ్, సిగ్నేచర్ వంటి మద్యం బ్రాండులను కారులో తీసుకెళ్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, పోలీసులకు ముందస్తు సమాచారం రావటంతో TS 08 GN 2525 నెంబరు కల హ్యుందాయ్ వెర్నా కారును ఆపారు. మద్యం బాటిల్ ఉన్న కాటన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: undefined

కారు డిక్కీ తెరవమని పోలీసులు ఆదేశించడంతో నిందితుడు బతిమాలుకున్నాడు. తాను లోకల్ రిపోర్టర్‌నని చెప్పాడు. ఆ బాటిళ్లను చూసీ చూడనట్లు వదిలేయాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. వీడియోలు, ఫోటోలు తీయవద్దని కోరాడు. అయినా వినని పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు తీసి తమ పై అధికారులకు పంపారు. అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.