యాప్నగరం

హైదరాబాద్‌లో షోరూం తగలబెట్టిన ఎలుక.. కోటి నష్టం.. అర్నెల్లకు దొరికిన ఆధారాలు

Musheerabad: ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆ నష్టం జరిగిన కొంత కాలానికే కేసు మూసివేశారు. కానీ, అసలు కారణం తాజాగా బయటపడింది. పూర్తి వివరాలివీ..

Samayam Telugu 21 Aug 2020, 12:12 am
హైదరాబాద్‌లో ఓ ఎలుక చేసిన పని ఓ షోరూం యజమానికి ఏకంగా రూ.కోటి నష్టాన్ని మిగిల్చింది. నిజానికి ఈ ఘటన ఎప్పుడో జరిగింది. కానీ, ఆ నష్టానికి అసలు కారణం ఎలుక అని ఇప్పుడే తెలిసింది. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆ నష్టం జరిగిన కొంత కాలానికే కేసు మూసివేశారు. కానీ, అసలు కారణం తాజాగా బయటపడింది. వినడానికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కదూ! పూర్తి వివరాలివీ..
Samayam Telugu వెలుగుతున్న దీపపు వత్తిని కుర్చీపై వేస్తున్న ఎలుక
a rat set fire in a showroom causing Rs 1 cr loss in hyderabad, shows CCTV footage


హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో మారుతీ నెక్సా సర్వీస్ సెంటర్‌లో మంటలు అంటుకొని కొన్ని కార్లు కాలిపోయిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తారీఖున అర్ధరాత్రి జరిగింది. సర్వీస్ సెంటర్‌లోని మొదటి అంతస్తులో మంటలు అంటుకొని నిమిషాల వ్యధిలోనే అవి గ్రౌండ్ ఫ్లోర్‌కు వ్యాపించాయి. అక్కడే సర్వీస్‌ కోసం వినియోగదారులు ఇచ్చిన కార్లను పార్క్ చేసి ఉంచారు. ఆ మంటలకు కార్లు కూడా కాలిపోయాయి. హుటాహుటిన ఫైరింజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు రూ.కోటి వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.

ఈ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఆ మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల వ్యాపించాయని కేసును మూసేశారు. ఈ ఘటన జరిగిన ఆర్నెల్ల తర్వాత గురువారం అసలు విషయం బయటికి వచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై ఇటీవల షోరూంలోని సీసీటీవీ ఫుటేజీని ఓ ప్రైవేటు ఫోరెన్సిక్ ఏజెన్సీ విశ్లేషించింది. అందులో మంటలు చెలరేగినందుకు గల అసలు కారణం బయటపడింది.

అంతా ఎలుక వల్లే..
అగ్ని ప్రమాదం జరిగిన రోజు సర్వీస్ సెంటర్ తెరిచాక ఉదయం పూజ నిర్వహించారు. సిబ్బంది పూజ చేసి దీపం వెలిగించారు. హారతిని అందరి దగ్గరికీ తీసుకెళ్లారు. సాయంత్రం ఎప్పట్లాగే సిబ్బంది మొత్తం తమ డ్యూటీలు ముగించుకొని సర్వీస్ సెంటర్‌కు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, ఆఫీస్‌లో ఎలాంటి పెద్ద గాలి లేకపోవడంతో ఉదయం వెలిగించిన దీపం రాత్రి వరకూ అలా వెలుగుతూనే ఉంది.

Also Read: ‘అసలు ముఖ్యమంత్రి కేటీఆరే.. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే మంచిది’

దీపపు వత్తిని తీసుకొచ్చిన ఎలుక


అదేరోజు రాత్రి 11.51 గంటల సమయంలో ఓ ఎలుక వెలుగుతున్న దీపపు వత్తిని నోటితో కరుచుకొని సిబ్బంది పని చేసుకొనే డెస్కు దగ్గరికి తీసుకొచ్చింది. అది దాని నోటి నుంచి జారి 11.55 నిమిషాలకు కుర్చీపై పడింది. ఇక 12.01కి ఆ కుర్చీకి డెస్కుకు మధ్య వెలుగు కనిపించింది. 12.06 నిమిషాలకు ఆ కుర్చీ మొత్తం పెద్ద మంటతో తగలబడడం మొదలైంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు గ్రౌండ్ ఫ్లోర్‌కు వ్యాపించి తీరని నష్టం జరిగింది.

ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే..
అగ్ని ప్రమాదం జరిగాక ఘటనా స్థలాన్ని అగ్ని మాపక నిపుణులు పరిశీలించారు. వారు అది షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని రిపోర్టు ఇచ్చారు. మేం దాని ఆధారంగా కేసును మూసివేశాం’’ అని ముషీరాబాద్ ఎస్సై టి.మురళీ వెల్లడించారు.

Must Watch: undefined

Must Read: మరో 3 రోజులు వానలే.. 23న మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.