యాప్నగరం

పని చేస్తున్న షాపుకే కన్నం.. ఆన్‌లైన్ ద్వారా రూ.లక్షలు స్వాహా..

Gowliguda: యజమానికి తెలియకుండా షాపు ఖాతా నుంచి విదేశంలో ఉన్న తన స్నేహితుడికి రూ.లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తన ఖాతాలో డబ్బు మాయం కావడం గమనించి షాపు యజమాని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 8 Aug 2020, 7:42 pm
పని చేసే దుకాణానికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. చివరకు కటకటలాపాలయ్యాడు. హైదరాబాద్‌ అఫ్జల్ గంజ్ సమీపంలో గౌలిగూడలోని స్టేషనరీలో భాస్కర్ బచ్చిరాజు అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. నమ్మకంగా పని చేస్తూనే ఇతను తన యజమానికి తెలియకుండా షాపు ఖాతా నుంచి విదేశంలో ఉన్న తన స్నేహితుడికి రూ.లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తన ఖాతాలో డబ్బు మాయం కావడం గమనించి షాపు యజమాని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu పని చేస్తున్న షాపుకే కన్నం.. ఆన్‌లైన్ ద్వారా రూ.లక్షలు స్వాహా..
A shop keeper thefts money through online in Hyderabad's afzalgunj


Also Read: TS: పడిపోయిన బీర్ల అమ్మకాలు.. లిక్కర్ మాత్రం జోరుగా.. కారణాలివే..

తమ అకౌంట్ నుంచి దుబాయ్‌కి చెందిన అకౌంట్లోకి తనకు తెలియకుండా 4 లక్షల 30 వేలు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని షాపు యజమాని ఫిర్యాదు చేశారు. పలుమార్లు అకౌంటెంట్ భాస్కర్‌ను అడిగినా, తనకు ఏమీ తెలియదని బుకాయించాడని పేర్కొన్నారు. భాస్కర్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వెంటనే యజమాని బాబు సింగ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Must Read: undefined

సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అదే స్టేషనరీలో పని చేస్తున్నా అకౌంటెంట్ ఎల్బీనగర్ నాగోల్‌కు చెందిన భాస్కర్ బచ్చిరాజు ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. దుబాయ్‌లో ఉండే మిత్రుడికి భాస్కర్ డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతని అరెస్టు చేసి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.