యాప్నగరం

భర్త ప్రాణాల కోసం భార్య భిక్షాటన.. కంటతడి పెట్టించిన ఘటన

Osmania University: భర్త కాలు చేయి పడిపోవడంతో ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఉన్నాడని, అతని దగ్గర ఎవరూ లేరని వెల్లడించింది. అతనికి మందుల ఖర్చు కోసం తాను భిక్షాటన చేసి డబ్బు సంపాదిస్తున్నట్లు వాపోయింది. కుమారులు చేరదీయకపోవడంతో తన భర్త కోసం తప్పని పరిస్థితుల్లో భిక్షాటన చేసి డబ్బు కూడబెడుతున్నట్లు మాణిక్యమ్మ తెలిపింది.

Samayam Telugu 6 Feb 2020, 2:28 pm
ఉద్యోగ విరమణ పొందిన కొందరు హోం గార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోంది. కొద్ది రోజల క్రితమే హోంగార్డుగా ఉద్యోగ విరమణ పొందిన ఓ మహిళ తన భర్త ప్రాణాల కోసం భిక్షాటన చేస్తుండడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఆ మహిళను గమనించిన స్థానికులు ఆమెను ప్రశ్నించగా.. తన గోడు వెళ్లబోసుకుంది.
Samayam Telugu OU Home Guard begging


గత నెల జనవరి 31న మాణిక్యమ్మ అనే మహిళ హోంగార్డుగా రిటైరయింది. తన భర్త కాలు చేయి పడిపోవడంతో ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఉన్నాడని, అతని దగ్గర ఎవరూ లేరని వెల్లడించింది. అతనికి మందుల ఖర్చు కోసం తాను భిక్షాటన చేసి డబ్బు సంపాదిస్తున్నట్లు వాపోయింది. కుమారులు చేరదీయకపోవడంతో తన భర్త కోసం తప్పని పరిస్థితుల్లో భిక్షాటన చేసి డబ్బు కూడబెడుతున్నట్లు మాణిక్యమ్మ తెలిపింది. అయితే, తాను రిటైర్ అయినా ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి తనకు ఏ సాయం అందలేదని బాధితురాలు తెలిపింది. ఫిబ్రవరి 13న అధికారులు రమ్మన్నారని, డబ్బు ఇస్తారో లేదో తెలియదని చెప్పింది.

ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ అయిన పలువురు హోంగార్డులు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రూ.5 నుంచి 6 వేల జీతానికి వాచ్‌మెన్‌లుగా పని చేస్తున్నారు. గవర్నమెంట్ వచ్చి హోంగార్డులకు జీతభత్యాలు పెంచిన తర్వాత నేపథ్యంలో ఆ ఫలాలు తాము ఎక్కువ అనుభవించలేని పరిస్థితి నెలకొదని.. తన ఉద్యోగ కాలపరిమితి అయిపోయిందని మాణిక్యమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఓయూ పోలీస్ స్టేషన్‌లో పని చేసే ఓ ఉద్యోగి తనకు రూ.500 సాయం చేసినట్లు కూడా ఆమె గుర్తు చేసుకుంది. భిక్షాటన ద్వారా తాను సంపాదించిన డబ్బుతో తన భర్తకు మందులు కొంటానని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.