యాప్నగరం

ఆసరా పింఛన్లలో భారీ అవినీతి.. పాతబస్తీలో నలుగురి అరెస్ట్

ఆసరా పింఛన్ల అంశంలో హైదరాబాద్‌లో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. సుమారు 350 మంది పింఛన్లను మూడు నెలలుగా పక్కదారి పట్టించారు. మోసగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 17 Sep 2019, 10:40 pm
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ల పంపిణీలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని భారీ అవినీతికి పాల్పడ్డారు. సుమారు 350 మంది పింఛన్లను మూడు నెలలుగా పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ అధికారి సహకారంతోనే ఈ మోసగాళ్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు మోసగాళ్లను పోలీసులు మంగళవారం (సెప్టెంబర్ 17) అరెస్టు చేశారు. ఆసరా పింఛన్లలో జరిగిన అవినీతి గురించి జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.
Samayam Telugu fraud


పాతబస్తీకి చెందిన సోహెల్, అస్లాం, మోసిన్, ఇమ్రాన్ అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగి అస్లాం సహకారంతో నిందితులు అవినీతికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. అస్లాం 2017లోనూ పింఛన్ల స్కాంలో జైలుకు వెళ్లొచ్చాడు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకపోవడం గమనార్హం.

Also Read: పవన్ కళ్యాణ్ పిలవగానే వెళ్తారా.. టీపీసీసీ చీఫ్‌పై కాంగ్రెస్ నేత సంపత్ ఫైర్

ఆసరా పింఛన్లలో అవినీతి వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. చార్మినార్ ఎమ్మార్వో జుబేదాపై బదిలీ వేటు వేసింది. చార్మినార్ పరిధిలో ఆసరా పింఛన్లలో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.