యాప్నగరం

చంచల్‌గూడ జైలు నుంచి ఆర్మీ రీక్రూట్‌మెంట్ అభ్యర్థుల విడుదల

Secunderabad Railway Station Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ ఆందోళనa సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల కేసులో అరెస్టైన ఆర్మీ రీక్రూట్‌మెంట్ అభ్యర్థులు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నెలన్నర రోజుల తర్వాత వారికి బెయిల్ లభించింది. దీంతో ఇంటికి తిరిగి పయనమయ్యారు. జైలు నుంచి అభ్యర్థుల విడుదల నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 5 Aug 2022, 12:35 am
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ ఆందోళన సందర్భంగా అరెస్టైన ఆర్మీ రీక్రూట్‌మెంట్ అభ్యర్థులు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నెలన్నర రోజుల తర్వాత వారికి బెయిల్ లభించడంతో ఇంటికి తిరిగి పయనమయ్యారు. జైలు నుంచి అభ్యర్థుల విడుదల నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. మొత్తం 15 మంది అభ్యర్థులు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
Samayam Telugu Chanchalguda Jail
చంచల్ గూడ జైలు


కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 17న ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ వద్దకు అభ్యర్థులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చేరుకొని మెరుపు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ విధ్వంసం జరిగింది.

రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసి, రైల్వే పోలీసులు, పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపారు. 15 మందిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. చంచలగూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. నిందితులు హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. పలుమార్లు వాదనల అనంతరం న్యాయస్థానం నేడు బెయిల్ మంజూరు చేసింది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.