యాప్నగరం

GHMC Elections: గ్రేటర్ ఎన్నికలపై టాలీవుడ్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు

డిసెంబర్ 1వతేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ పైనే ఉంది. గ్రేటర్‌లో మేయర పీఠం ఎవరికి దక్కుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Samayam Telugu 20 Nov 2020, 3:36 pm
తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ ఆడియన్స్ దగ్గరైన హీరో అడవి శేష్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉంటాడు. కొన్ని సామాజిక అంశాల పట్ల కూడా స్పందిస్తూ ఉంటాడు. తాజాగా గ్రేటర్ ఎన్నికలపై అడవి శేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్‌లో ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్‌వాటర్‌ని ఎక్కువగా తోడేస్తున్నామన్నాడు.
Samayam Telugu జీహెచ్ఎంసీ ఎన్నికలు
ghmc elections 202


అంతేకాదు.. సిటీలో భారీ కన్‌స్ట్రక్షన్స్‌ చేపట్టడం, ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లు వేసేస్తున్నామని తెలిపాడు. హైదరాబాద్‌లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఓటుహక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా, దొరక్కపోయినా లీడర్స్‌కి మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడమని అడవి శేష్ పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు నగరంలో వాతావరణం విషయంలో ఇప్పుడు ఉన్న అభివృద్ధి కాకుండా ఇంకొంచెం అభివృద్ధి జరగాలని అడవి శేష్ కోరాడు.

Read More: గ్రేటర్ ఎన్నికల గుర్తుల కేటాయింపు.. జనసేనకు దక్కిన గాజు గ్లాసు

'గూఢచారి', 'ఎవరు' క్షణం వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్. పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో నటించి మెప్పించాడు. అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. అడివి శేష్ ప్రస్తుతం 'మేజర్', 'గూఢచారి 2' మూవీస్ లో నటిస్తున్నారు. శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా 'మేజర్ ' మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.