యాప్నగరం

వాళ్లతో ఏం మాట్లాడతావ్.. దమ్ముంటే నాతో రా.. ఒవైసీ సవాల్

Karimnagar: మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌లోని అశోక్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఎంఐఎం ప్రచార సభలో అసదుద్దీన్ మాట్లాడారు. ఈ సభకు పెద్ద ఎత్తున మైనార్టీలు, ఎంఐఎం కార్యకర్తలు వచ్చారు.

Samayam Telugu 22 Jan 2020, 8:39 am
కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై తనతో చర్చించేందుకు ముందుకు రావాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హోం మంత్రి అమిత్ షాకు సవాలు విసిరారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీతో చర్చించడం కాదని.. దమ్ముంటే తనతో మాట్లాడాలని ఘాటు విమర్శలు చేశారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌లోని అశోక్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఎంఐఎం ప్రచార సభలో అసదుద్దీన్ మాట్లాడారు. ఈ సభకు పెద్ద ఎత్తున మైనార్టీలు, ఎంఐఎం కార్యకర్తలు వచ్చారు. మంగళవారం లక్నోలో నిర్వహించిన సీఏఏ అనుకూల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. సీఏఏపై చర్చకు రావాలని రాహుల్, మమతా, మయావతికి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒవైసీ దానికి కౌంటర్ ఇచ్చారు.
Samayam Telugu Asaduddin Owaisi


Also Read: పాఠశాలలోనే కుక్కకు ఇల్లు.. ఫైన్ల డబ్బుతో నిర్మించిన ప్రిన్సిపల్!

తాను తియ్యటి హల్వా వంటి స్వభావం కల వాణ్ని కాదని, ఎర్రటి మిర్చి కారం వంటివాడినని ఒవైసీ అభివర్ణించుకున్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సీఏఏ, ఎన్‌పీఆర్‌కు ఈ ఎన్నికలు ప్రజా తీర్పు వంటివని ఒవైసీ పేర్కొన్నారు. గత నెల రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ గురించి అవగాహన కల్పిస్తున్నానని అన్నారు. ముస్లింలు ఆపదలో ఉన్నపుడు ఏ లౌకికవాద పార్టీ పరామర్శించేందుకు రాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కరీంనగర్‌లో పోటీ చేస్తున్న 10 మంది కార్పొరేటర్లు గెలిస్తేనే ఇక్కడ ఎంఐఎం బలమైన శక్తిగా ఎదుగుతుందని ఓవైసీ అన్నారు. మజ్లిస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కొంతమంది ప్రతి రోజు తన పేరుతో చర్చాకార్యక్రమాలు నిర్వహిస్తూ రేటింగులు పెంచుకుంటున్నాయని అన్నారు.

Also Read: ఆకాశం నుంచి భూమికి భారీ బెలూన్లు.. జాగ్రత్త! ముట్టుకుంటే అంతే..

‘‘బీజేపీ నేతల గురించి మీకు ఆందోళన వద్దు. మీకు నేనున్నాను. మీరు ధైర్యంగా ఓటు వేయండి. అమిత్ షా రాహుల్ గాంధీ, మమతలతో సీఏఏపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని కొందరు జర్నలిస్టులు నాకు చెప్పారు. నేను ఇప్పుడు చెబుతున్నా మీరు నాతో చర్చించండి. వాళ్లతో ఏం మాట్లాడతారు? మమత బెనర్జీ అసదుద్దీన్‌కు వ్యతిరేకం. రాహుల్ ఉదయం ఏం మాట్లాడతారో సాయంత్రం ఏం మాట్లాడతారో తెలియదు.’’ అని ఒవైసీ ప్రసంగించారు.

Also Read: ఇంకా ఇరకాటంలోకి మంత్రి మల్లారెడ్డి.. మరిన్ని కాల్ రికార్డులు బహిర్గతం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.