యాప్నగరం

ఏ మాత్రం సిగ్గున్నా పదవి నుంచి తప్పుకోండి: ఒవైసీ

JNU violence: ‘ఏ బీజేపీ ఎంపీకి ఈ వ్యవహారంతో సంబంధముంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపాలి. దుండగుల చేతుల్లో ఇనుప రాడ్లు ఉన్నాయి. చివరికి జేఎన్‌యూ విద్యార్థి నాయకుణ్ని కూడా వారు కొట్టారు. ఇది కచ్చితంగా హత్యాయత్నమే’

Samayam Telugu 8 Jan 2020, 11:29 am
ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్ర తరం చేస్తున్న ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఢిల్లీ జేఎన్‌యూ దాడి ఘటనపై స్పందించారు. వర్సిటీ విద్యార్థులపై పోలీసులు కేసు చేయడాన్ని ఒవైసీ తప్పుబడ్డారు. ముందు దాడికి పాల్పడ్డవారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులకు సంరక్షకుడిగా ఉండాల్సిన జేఎన్‌యూ వీసీ సిగ్గుంటే తన పదవి నుంచి తప్పుకోవాలని తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ముసుగు దుండగులు వర్సిటీ లోనికి ఎలా ప్రవేశించారు. ఏ బీజేపీ ఎంపీకి ఈ వ్యవహారంతో సంబంధముంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపాలి. దుండగుల చేతుల్లో ఇనుప రాడ్లు ఉన్నాయి. చివరికి జేఎన్‌యూ విద్యార్థి నాయకుణ్ని కూడా వారు కొట్టారు. ఇది కచ్చితంగా హత్యాయత్నమే’’ అని ఒవైసీ విమర్శలు చేశారు.
Samayam Telugu Asaduddin Owaisi


Also Read: నిలిచిపోయిన మెట్రో రైళ్లు, కిక్కిరిసిన అమీర్ పేట్ స్టేషన్‌

దాడి సమయంలో ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఢిల్లీ పోలీసులు తాత్సారం చూపారని, విద్యార్థినుల విషయంలోనూ జాలి చూపలేదని విమర్శించారు. అదే జామియా మిల్లియా విశ్వవిద్యాలయంలో సీఏఏ ఉద్రిక్తతల సమయంలో మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరుకు ఓ విద్యార్థి కంటి చూపు పోయిందని ధ్వజమెత్తారు. జేఎన్‌యూ దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇదే ‘న్యూ ఇండియా’ కాబోలు అని ఎద్దేవా చేశారు. అయితే, పోలీసుల వాదన మరోలా ఉంది. జనవరి 5న జరిగిన ఘటనలో వర్సిటీలోని సర్వర్ రూం విధ్వంసం వ్యవహారంలో విద్యార్థినిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read: ఆ విషయంలో హైదరాబాదే నెం.1

ఆదివారం యూనివర్సిటీలోకి ముసుగు దుండగులు చొరబడి కొందరు విద్యార్థులపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. వీరి దాడిలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా అసదుద్దీన్ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఈ నెల 10న జరుగుతుందని కొద్ది రోజుల క్రితమే వెల్లడించారు. మళ్లీ జనవరి 25న చార్మినార్ వద్ద మరో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.

Also Read: ఇంటర్ విద్యార్థులకు ఏమైనా ఫిర్యాదులా..? ఇలా చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.