యాప్నగరం

నెమ్మదిగా డేంజర్ జోన్‌లోకి హైదరాబాద్.. ఢిల్లీ, చెన్నై తర్వాత మూడో ప్లేస్..

Hyderabad: లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా నగరంలో ఇంకా ఆర్టీసీ, మెట్రో వంటి ప్రజా రవాణా మొదలు కాలేదు. దీంతో చాలా మంది సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు.

Samayam Telugu 4 Sep 2020, 10:55 am
హైదరాబాద్ మహానగరంపై వాయు కాలుష్య మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపుతోంది. కరోనా వల్ల విధించాల్సి వచ్చిన లాక్‌డౌన్‌ కారణంగా భారీగా తగ్గిన కాలుష్యం ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. నగరంలో కాలుష్యం ఇప్పుడు ఢిల్లీతో పోటీ పడుతోందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా అధ్యయనంలో వెల్లడించింది. నగరంలో మోటారు వాహనాల ద్వారానే వాయు కాలుష్యం పెరిగిపోతున్నట్లు గుర్తించారు. వాటి నుంచి వెలువడే నైట్రోజన్‌ డయాక్సైడ్‌ పెద్ద మొత్తంలో వెలువడుతున్నట్లు నిపుణులు వెల్లడించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
love hyd


చెన్నైలో 77 శాతం వాయు కాలుష్యం పెరిగితే, ఢిల్లీలో 49 శాతం, హైదరాబాద్‌లో 40 శాతం, బెంగళూరులో 38 శాతం కాలుష్యం పెరిగిందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా అధ్యయనంలో వెల్లడించింది. మార్చి 22 నుంచి మే మూడో వారం వరకు లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో వాయు కాలుష్యం భారీగా తగ్గిపోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక, రోడ్ల మీదకి మళ్లీ వాహనాల రాక మొదలైంది.

లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా నగరంలో ఇంకా ఆర్టీసీ, మెట్రో వంటి ప్రజా రవాణా మొదలు కాలేదు. దీంతో చాలా మంది సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. గతంలో సొంత వాహనాలు లేని వారు అవసరాన్ని బట్టి తక్కువ ధరలకు పాత వాహనాలను కొనుగోలు చేసి నడుపుతుండడం వల్ల కూడా వాయు కాలుష్యం పెరుగుదలకు ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మార్చి 27 నుంచి మే 17 వరకు వాయు కాలుష్యం తగ్గిందని, ఇప్పుడు మళ్లీ పెరిగిందని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చెప్పారు. అయితే, ఢిల్లీ, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో వాయు కాలుష్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతి పౌరుడు స్వీయ నియంత్రణ పాటించినప్పుడే వైరస్‌తో పాటు ఇటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని సూచించారు.

Must Read: undefined

Must Read: 139 మంది రేప్ కేసు: మళ్లీ కథ అడ్డం తిప్పిన బాధితురాలు.. అన్నీ ట్విస్టులే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.