యాప్నగరం

సీనియర్ న్యూస్ రీడర్ మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం

All India Radio: మాడపాటి సత్యవతి హైదరాబాద్ నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావుకు మనువరాలు. హైదరాబాద్‌లోనే జన్మించారు. నిజాం కాలంలో రజాకార్ల అరాచకాలను చూశారు.

Samayam Telugu 4 Mar 2020, 10:54 am
ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి చనిపోయారు. ఈమె మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల పాటు మాడపాటి సత్యవతి తన స్వరంతో రేడియో వార్తలు చదివారు. లక్షలాది మంది శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తిగా ఆమె నిలిచిపోయారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu madapatisatyavathi


Also Read: కరోనా: హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ ఎండీలకు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు

మాడపాటి సత్యవతి హైదరాబాద్ నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావుకు మనువరాలు. హైదరాబాద్‌లోనే జన్మించారు. నిజాం కాలంలో రజాకార్ల అరాచకాలను చూశారు. తెలుగు చదువుకోవడంపై నిషేధం ఉన్న కాలంలోనే తన తాత హనుమంతరావు స్థాపించిన బాలికల తెలుగు ఉన్నత పాఠశాలలో సత్యవతి చదువుకున్నారు.

Also Read: కరోనా కలకలం: హైదరాబాద్‌లో ఆ 61 స్కూళ్ల పిల్లలకు వైద్య పరీక్షలు

ఆకాశవాణి ఆలిండియా రేడియోలో సత్యవతి న్యూస్ రీడర్‌గా పనిచేశారు. రేడియోలో సుదీర్ఘకాలం న్యూస్ ఎడిటర్‌గా, న్యూస్ రీడర్‌గా పని చేసిన వ్యక్తిగా సత్యవతి గుర్తింపు పొందారు. వార్తావాహిని పేరుతో ఆమె ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం-హైదరాబాద్ పురస్కారాన్ని 2017లో సత్యవతికి ఇచ్చి సత్కరించింది.

Also Read: కరోనా లక్షణాలతో మరో ముగ్గురు.. అపోలో ఆస్పత్రి సిబ్బంది కూడా గాంధీకి తరలింపు

Must Read: హైదరాబాద్: కరోనా సోకిన వ్యక్తికి ఎయిర్‌పోర్టులో పరీక్షలు ఎందుకు చేయలేదంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.