యాప్నగరం

GHMC Elections: రోడ్ షో మధ్యలోనే వెళ్లిపోయిన అమిత్ షా.. కారణమిదే..

Secunderabad: ఈ రోడ్ షోలో అమిత్ షా ప్రసంగించలేదు. రోడ్లపై, భవనాలపై ఉన్న ప్రజలకు చేయి ఊపుతూ, నమస్కారం చేస్తూ ముందుకు కదిలారు. నామాలగుండు వద్ద రోడ్ షోను ముగించేశారు.

Samayam Telugu 29 Nov 2020, 3:54 pm
హైదరాబాద్‌కు ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అర్ధాంతరంగా రోడ్ షో ముగించాల్సి వచ్చింది. సికింద్రాబాద్‌ వారసీగూడ నుంచి సీతాఫల్ మండి వరకు నిర్వహించే రోడ్ షోలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అయితే, అమిత్ షా రోడ్ షోకు ఊహించిన దానికంటే భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో రోడ్ షో ముందుకు కదలడం చాలా కష్టంగా మారింది. అమిత్ షా నిలబడ్డ వాహనం ముందుకు కదలడానికి చాలా సమయం పట్టింది.
Samayam Telugu రోడ్ షోలో అమిత్ షా
Amit shah


దీంతో చేసేది లేక అమిత్ షా నామాలగుండు వద్ద రోడ్ షోను ముగించేశారు. నామాల గుండు నుంచి అమిత్ షా నేరుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అమిత్ షా వెళ్లిపోవడంతో కార్యకర్తలు కాస్త నిరుత్సాహపడ్డారు. అయితే, ఈ రోడ్ షోలో అమిత్ షా ప్రసంగించలేదు. రోడ్లపై, భవనాలపై ఉన్న ప్రజలకు చేయి ఊపుతూ, నమస్కారం చేస్తూ ముందుకు కదిలారు.

ప్లకార్డులతో నిరసన
అంతేకాక, అమిత్ షాకు రోడ్ షోలో కాస్త నిరసన సెగ తగిలింది. రోడ్ షో సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సేవ్ బీఎస్ఎన్‌ఎల్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. వారసీగూడలో నివాసం ఉంటున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఇలా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కూడా ఆ విషయాన్ని బాగా ఎత్తి చూపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.