యాప్నగరం

Telangana Bjp: ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ దూకుడు.. వచ్చే నెలలో రెండు భారీ బహిరంగ సభలు

Telangana Bjp: తెలంగాణలో ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో కాషాయదళం వేగంగా పావులు కదుపుతోంది. పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా వచ్చే నెలలో రెండు బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 22 May 2023, 1:12 pm

ప్రధానాంశాలు:

  • వచ్చే నెలలో రెండు బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్
  • ముఖ్యఅతిధులుగా అమిత్ షా, జేపీ నడ్డా
  • ఎన్నికల వేళ దూకుడు పెంచిన బీజేపీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bjp  telangana
బీజేపీ
Telangana Bjp: వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా తెలంగాణ బీజేపీ దూకుడు పెంచుతోంది. కర్ణాటక ఫలితాలతో కాస్త నిరాశలో ఉన్న రాష్ట్ర బీజేపీ వర్గాలు.. మళ్లీ స్పీడ్ పెంచేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా వచ్చే నెలలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభలకు జాతీయ అగ్రనేతలు కూడా రానున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వీటికి సంబంధించిన వివరాలను ప్రకటించారు.
ఒక సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననుండగా.. మరో సభలో జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. సోమవారం చంపాపేటలో తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు బండి సంజయ్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. మే 30 నుంచి జూన్ 30 వరకు మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. మోదీ ప్రభుత్వం గత 9 ఏళ్లల్లో తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణలో కేంద్ర పథకాలు అమలు కావడం లేదని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు. కేంద్ర నిధులను సర్కార్ దారి మళ్లిస్తుందని అన్నారు. మోదీ నేతృత్వంలో చాలా విజయాలు సాధించినట్లు బండి చెప్పారు.

బీఆర్ఎస్ పర్కార్ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బండి సంజయ్ తెలిపారు. పేదల కోసం మోదీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయిందని ఆరోపించారు. గరీబ్ కల్యాణ్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, బీజేపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి కరెంట్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. రైతు వేదికలకు కేంద్రం నిధులు ఇచ్చిందని, పేద ప్రజలకు కాపాడేది మోదీ మాత్రమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోందని, అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంటే ఎంతో మేలు జరిగే అవకాశముందని, డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బండి సంజయ్ సూచించారు. పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ది అంతా కేంద్ర నిధులతోనే జరుగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని, ఇక్కడ అమలు చేస్తే పేదలకు ఎంతో లాభం జరుగుతుందన్నారు.




  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.