యాప్నగరం

కార్యకర్తను కొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... జనం నిలదీయడంతో క్షమాపణలు

గ్రామంలో పార్టీ కార్యకర్తల్ని కలిసేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈలోపు ఓ ఎమ్మెల్యే నిలబడి ప్రశ్నించడంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అతనిపై చేయిచేసుకున్నారు.

Samayam Telugu 21 Sep 2020, 10:57 am
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి కూడా సహనం కోల్పోయారు. సొంత పార్టీ కార్యకర్తపైనే చేయిచేసుకున్నాడు. దీతో స్థానికులతో నిలదీయడంతో క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని తొగుట మండలం వెంకట్రావుపేటలో ఆదివారం పర్యటించారు. గ్రామంలో కార్యకర్తలను కలిసేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. దీంతో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సిలివేరి మల్లారెడ్డి ఉన్నారు.
Samayam Telugu టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
trs mla kranthi kiran


Read More: తెలంగాణ ప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు

అయితే సమావేశం జరుగుతుండగా కనకరాజు అనే కార్యకర్త తనకు పార్టీలో సభ్యత్వం ఇవ్వకపోవడంపై మల్లారెడ్డిని నిలదీశారు. దీంతో అసహనానికి గురైన క్రాంతికిరణ్‌.. కనకరాజుపై చేయిచేసుకున్నారు. దీంతో గ్రామస్థులంతా ఎమ్మెల్యేను నిలదీశారు. మా ఊరికొచ్చి మా పిల్లలపై చేయి చేసుకుంటావా? అంటూ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాంతిని ఘెరావ్‌ చేయడంతో.. ఎమ్మెల్యే వారందరికీ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత సమావేశంలో గొడవ జరగకుండా తాను కనకరాజు భుజంపై చేయి వేసి సముదాయించానని, అతనిపై చేయి చేసుకోలేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.


    తరవాత కథనం

    Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
    తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.