యాప్నగరం

TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కేసులు వెంటాడుతున్నాయి. రవిప్రకాశ్ మీడియా హౌస్‌కు చెందిన వెబ్ ఛానెళ్లు తనపై తప్పుడు కథనాలను ప్రచురించాయంటూ రామారావు అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 15 Oct 2019, 11:39 pm
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రవిప్రకాశ్‌కు చెందిన వెబ్‌ ఛానెల్స్‌లో తనపై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై మంగళవారం (అక్టోబర్ 15) ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్‌పై తాను ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా.. తప్పుగా ఫిర్యాదు చేసినట్లు వెబ్‌ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu Ravi Prakash2


రవిప్రకాశ్ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు ఫిర్యాదు చేశారని.. ఆ విషయంలో తన ప్రమేయం లేకున్నా, ఆ ఫిర్యాదు కాపీ తనదే ఆంటూ ఆసత్య ప్రచారం చేస్తున్నారని రామారావు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Must Read: రిపోర్టర్‌ను నరికి చంపిన దుండగులు.. ఏపీలో దారుణం

తన పరువుకు భంగం కలిగించిన రవిప్రకాశ్ మీడియా హౌస్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు రామారావు తెలిపారు. రామారావు నెల కిందట పంపిన లేఖనే తాజాగా విజయసాయి రెడ్డి తన లెటర్ హెడ్‌పై పంపించారని ఆరోపిస్తూ రవిప్రకాశ్‌కు చెందిన వెబ్ ఛానెళ్లలో కథనాలను ప్రచురించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.