యాప్నగరం

‘సమత’ కుటుంబంలో మరో విషాదం

Samatha Gang Rape కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. మరోవైపు ఆమె మరణించిన కొద్ది రోజులకే ఆ కుటుంబంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి మామ ఎల్లయ్య హఠాన్మరణం చెందారు.

Samayam Telugu 14 Dec 2019, 12:02 pm
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. మొత్తం 140 పేజీల ఛార్జిషీటును పోలీసులు ఇప్పటికే సిద్ధం చేశారు. మొత్తం 44 మంది సాక్షులను విచారణ జరిపి, అన్ని ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్టుమార్టం నివేదికలు ఇప్పటికే అందగా, వాటిని జత చేసి కోర్టుకు సమర్పించనున్నారు.
Samayam Telugu Samatha rape


గత నెల 24న సమత కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజే ఆమె శవమై కనిపించింది. ముగ్గురు నిందితులు సమతను అత్యాచారం చేసి చంపినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వీటికి సంపాదించిన ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఘటన జరిగిన 3 రోజుల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముఖ్‌దూంలు ఒంటరిగా ఉన్న మహిళను గమనించి బలవంతంగా పొదల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం హత్య చేశారు. నిందితులకు గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.

సమత కుటుంబంలో మరో విషాదం
మరోవైపు సమత కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కుటుంబంలో బాధితురాలి మామ ఎల్లయ్య హఠాన్మరణం చెందారు. సమత చనిపోయినందుకు ఎల్లయ్య తీవ్ర మనస్థాపానికి గురై మరణించినట్లుగా తెలుస్తోంది.

కుమురంభీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్న మహిళ సమత అత్యాచారం, హత్య ఉదంతంపై కొద్ది రోజుల క్రితం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును త్వరగా విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం గతంలో పంపిన ప్రతిపాదనలపై తెలంగాణ హైకోర్టు ఆమోదముద్ర వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.