యాప్నగరం

వినాయక మంటపంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం.. తన విగ్రహంతో ఫొటో దిగిన నేత

వినాయకుడి విగ్రహం పక్కనే నాయకుడి విగ్రహం ఏర్పాటు చేసిన ఘటన ఆర్మూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. గణపతి మంటపంలో.. దేవుడి విగ్రహం పక్కనే ఎమ్మెల్యే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తన విగ్రహంతో సదరు ఎమ్మెల్యే ఫొటో కూడా దిగడం గమనార్హం.

Samayam Telugu 8 Sep 2019, 8:04 pm
యాదాద్రి ఆలయ శిలలపై కేసీఆర్, ప్రభుత్వ పథకాల గురించి చెక్కడం.. ఈ విషయమై తెలంగాణ ప్రజానీకం భగ్గుమనడంతో వాటిని తొలగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ముగియక ముందే టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహాన్ని వినాయక మంటపంలో ఏర్పాటు చేశారనే వార్త వైరల్ అయ్యింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం పక్కన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Samayam Telugu armoor mla


ఈ వినాయక మండపాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే.. అక్కడ ఏర్పాటు చేసిన తన విగ్రహాన్ని చూసి ముచ్చటపడ్డారు. ఆ విగ్రహంతో ఆయన ఫొటో కూడా దిగారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు సన్నిహితుడిగా పేరుపొందిన జీవన్ రెడ్డి విగ్రహాన్ని వినాయక మండపంలో ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషికి గుర్తుగానే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. కానీ దేవుడి విగ్రహం పక్కనే ఇలా ఎమ్మెల్యే విగ్రహం పెట్టడం ఏంటని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మరీ ఇంత ప్రచార ఆర్భాటం ఏంటని నిలదీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.