యాప్నగరం

సిరిసిల్ల కలెక్టర్‌కు అరుణాచల్ ప్రదేశ్ సీఎం ధన్యవాదాలు

Rajanna Sircilla: హైదరాబాద్‌లో ఉంటున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ విద్యార్థులకు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ సహకారంతో వారికి నిత్యావసరాలు అందేలా చూశామని కలెక్టర్ చెప్పారు.

Samayam Telugu 11 Apr 2020, 11:29 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో చదువుకుంటున్న తమ రాష్ట్ర విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి రేషన్ వంటి సరకులు అందించాలని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ట్విటర్ ద్వారా జిల్లా యంత్రాంగాన్ని కోరారు. హైదరాబాద్‌లో ఉంటున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ విద్యార్థులకు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ సహకారంతో వారికి నిత్యావసరాలు అందేలా చూశామని కలెక్టర్ చెప్పారు.
Samayam Telugu Pema-Khandu


Also Read: undefined

అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థులకు రేషన్ సరకులు అందించడంపై సీఎం అభినందించారు. దీనిపై స్పందించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనం మేరకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.