యాప్నగరం

GHMC Elections: టీఆర్ఎస్‌తో ఎంఐఎం పొత్తు ఉందా? లేదా? అసదుద్దీన్ క్లారిటీ

AIMIM: హైదరాబాద్‌కు భారీ వరద వస్తే కేంద్రం చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదని అసదుద్దీన్ విమర్శించారు. బీజేపీ హిందుత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

Samayam Telugu 22 Nov 2020, 3:50 pm
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబి పార్టీతో పొత్తు ఉందా లేదా అనే అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టత ఇచ్చారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదని ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని బల్దియా ఎన్నికలో తాము 52 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వివరించారు. చాలా చోట్ల టీఆర్‌ఎస్ పార్టీనే తమకు పోటీగా ఉందని తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోవడంపైనా ఒవైసీ స్పందించారు.
Samayam Telugu అసదుద్దీన్ ఒవైసీ (ఫైల్ ఫోటో)
Owaisi


హైదరాబాద్‌కు భారీ వరద వస్తే కేంద్రం చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదని విమర్శించారు. బీజేపీ హిందుత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ముస్లింలకు లేదా? అని అసదుద్దీన్ పశ్నించారు.

మరోవైపు, అసదుద్దీన్‌ ఒవైసీతో కేసీఆర్‌‌తో గత గురువారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రగతిభవన్‌‌లో వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. గత ఎన్నికల్లో మొత్తం 150 సీట్లకు గాను టీఆర్‌ఎస్‌ 99, ఎంఐఎం 40 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా, లేక విడివిడిగా పోటీ చేస్తాయా అన్న సందిగ్ధతకు ఒవైసీ తెర దించారు.

ఇప్పటికే టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకటేనని.. ఒవైసీని కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉందని బీజేపీ నాయకులు తరచూ వ్యాఖ్యలు చేస్తుంటారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మిత్రపక్షాలే అయినా విపక్షాల విమర్శలకు నేరుగా చిక్కకుండా ఉండేందుకు ఇలా వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.