యాప్నగరం

ఇది ఏ తరహా లాక్‌డౌన్? కేంద్రంపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

India Lockdown: ప్రజల జీవితాలతో ఇలా ఆడుకోవద్దని ఒవైసీ అన్నారు. ఇలాంటి వలసదారుల సంక్షేమం కోసం ఎలాంటి ఆలోచన చేయకుండా లాక్ డౌన్ విధించడం దారుణమని ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు.

Samayam Telugu 29 Mar 2020, 9:44 am
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దిల్లీ, జైపూర్‌లో వేలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పడుతున్న అవస్థలపై ఆయన ప్రశ్నించారు.
Samayam Telugu Asaduddin Owaisi


Must Read: వంట చేసి భార్యకు రుచి చూపించిన రేవంత్, నారా లోకేశ్ కరోనా టిప్స్

‘‘ఇది ఏ తరహా సెంట్రల్ లాక్ డౌన్, వలస వచ్చి బతుకుతున్నవారు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించరు. ప్రభుత్వం దిల్లీలో యూపీ వలసదారులను వెనక్కి నెట్టగలిగితే, తెలంగాణ కూడా బిహార్ యూపీ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ నుంచి ఇక్కడికి వచ్చిన ఒంటరి వలసదారులను అలాగే చేయాలా?’’ అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. పశ్చిమ బంగాల్, యూపీ, బిహార్ ప్రభుత్వాలు ఇలా చిక్కుకుపోయిన వలసదారులకు ఎలాంటి సాయం చేయట్లేదని ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఇలా ఆడుకోవద్దని అన్నారు. ఇలాంటి వలసదారుల సంక్షేమం కోసం ఎలాంటి ఆలోచన చేయకుండా లాక్ డౌన్ విధించడం దారుణమని ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు.

Also Read: స్విగ్గీ, జొమాటోతో కూరగాయల హోం డెలివరీ.. ఎలాగంటే

తబీనా అంజుమ్ అనే వ్యక్తి జైపూర్‌లో వలస దారులు పడుతున్న అవస్థలకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. యూపీ, బిహార్‌కు చెందిన వేలాది మంది వలసదారులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఒకే చోట చేరారు. కానీ, వారికి ఏ రవాణా సదుపాయమూ కల్పించలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోపై అసదుద్దీన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

Also Read: నేను చనిపోలేదు, ఆ ఆంటీని వలవేసి పట్టుకోలేదు.. కరోనా సోకిన డీఎస్పీ కుమారుడి వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.