యాప్నగరం

లంచం తిరిగిచ్చేస్తా.. ఎమ్మార్వో ‘నిజాయతీ’

Asifabad: డబ్బు తీసుకొని తమ పొలం సమస్యలు పరిష్కరించకుండా బదిలీపై వెళ్తుండడంతో రైతులు ఆగ్రహించారు. అంతా కలిసికట్టుగా తహసీల్దార్‌ను చుట్టుముట్టారు.

Samayam Telugu 31 Jul 2020, 5:37 pm
కుమ్రుం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానెపల్లి తహసీల్దార్ ఖాజా నియాజుద్దీన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బికర్ణదాస్ బాధ్యతలు చేపట్టారు. ఇందులో వార్తేముంది అనుకుంటున్నారా..? నిజమే మామూలుగా అయితే దీనికి అంతగా ప్రాధాన్యం లేదు. కానీ ఇదో స్పెషల్ కేసు. ఎందుకంటే.. బదిలీ అయిన తహసీల్దార్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతు సమస్యలు పరిష్కారిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం, తహసీల్దార్ రాసిచ్చిన హామీ పత్రం
money payment


ఏదైనా పని జరగాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందే అనే ఆరోపణలున్నాయి. ఈ తహసీల్దార్ సంగతి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆయన్ను జిల్లా కేంద్రానికి ట్రాన్స్‌ఫర్ చేశారు. డబ్బులు ఇచ్చిన రైతులకు ఈ విషయం తెలిసి తహసీల్దార్ నియాజుద్దీన్‌ను నిర్బంధించారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదంటే తమ పనులు చేసి పెట్టాలని డిమాండ్ చేశారు.

ఫైళ్లు ముందేసుకొని తిరగేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. గురువారం కొత్త తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలిసిన రైతులు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓ దశలో పోలీసులు జోక్యం చేసుకొని రైతుల ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేశారు.

Must Read: undefined

దీంతో చేసేదేం లేక ఆ తహసీల్దార్ అంగీకరించారు. తాను ఏయే రైతు దగ్గర ఎంత మేర డబ్బులు తీసుకున్నాననే విషయం కాగితం మీద రాసి.. 18వ తేదీలోగా తిరిగి ఇచ్చేస్తానని సంతకం చేశారు. ఆయన లంచాల రూపంలో రూ.10 లక్షల వరకు తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. రైతులకు ఈ భరోసా లేఖ ఇచ్చిన తహసీల్దార్ మీద ఉన్నతాధికారులు ఏవైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

Must Read: undefined

ఒక్కో రైతు నుంచి రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు తహసీల్దార్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆకస్మాత్తుగా బదిలీ అవ్వడం వల్ల రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయాడు. చివరకు తహసీల్దారు రైతులకు ఎవ్వరికి ఎంత చొప్పున ఇవ్వాలో 18వ తేదీలోపు ఇస్తానంటూ తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చారు. దీంతో రైతులంతా ఆందోళనను విరమించారు.

Must Read:పెద్దాయన చిరకాల కోరిక తీర్చిన కరోనావైరస్.. ఏకంగా 33 ఏళ్లుగా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.