యాప్నగరం

పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: కేసీఆర్

PV Narasimha Rao: వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.

Samayam Telugu 28 Aug 2020, 7:08 pm
సెప్టెంబరులో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
Samayam Telugu పీవీ నరసింహారావు, కేసీఆర్ (ఫైల్ ఫోటోలు)
PV Narasimha rao kcr


ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? కరోనా నిబంధనలు సడలించాక పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే విషయాలపై కార్యాచరణ రూపొందించాలని పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులకు పీవీ సూచించారు.

పీవీ లాంటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తామని కేసీఆర్ అన్నారు. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని అన్నారు. అంతేకాక, అసెంబ్లీలో పీవీ నరసింహారావు పొట్రేయిట్ (తైల వర్ణ చిత్రం-చిత్తరువు) పెట్టాలని నిర్ణయించామని, భారత పార్లమెంటులో కూడా పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో పీవీ నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కూడా కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.