యాప్నగరం

కరోనాతో బాచుపల్లి ఎస్సై మృతి.. కానిస్టేబుల్ ప్లాస్మా దానం చేసినా దక్కని ప్రాణం

కరోనా వైరస్ బారిన పడి ఓ ఎస్సై ప్రాణాలు కోల్పోయారు. బాచుపల్లిలో ఎస్సైగా పని చేస్తున్న మహమ్మద్ యూసుఫ్ గురువారం ఉదయం కోవిడ్ కారణంగా తుది శ్వాస విడిచారు.

Samayam Telugu 6 Aug 2020, 1:35 pm
హైదరాబాద్‌: కరోనా మహమ్మారి పోలీసు శాఖలో మరో అధికారిని బలి తీసుకుంది. బాచుపల్లి ఎస్సై యూసుఫ్ కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. గత 15 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన పరిస్థితి విషమించడతో ప్లాస్మా థెరపీ కూడా చేసినట్లు సమాచారం.
Samayam Telugu bachupalli si


యూసుఫ్‌కు ప్లాస్మా అవసరం అని తెలియడంతో.. చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సాయి కుమార్ అనే కానిస్టేబుల్ ముందుకొచ్చాడు. బక్రీద్ రోజునే ప్లాస్మా దానం చేశాడు. ఓ ముస్లిం ఎస్సైకి హిందూ కానిస్టేబుల్ ప్లాస్మా దానం చేయడం.. అది కూడా బక్రీద్ రోజున కావడంతో.. దీన్ని మతసామరస్యానికి ప్రతీకగా పేర్కొన్నారు.

యూసుఫ్‌కు సాయికుమార్ ప్లాస్మా దానం చేసిన విషయాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ పోలీసులు, భారతీయుల మతం మానవత్వం అని ఆయన తెలిపారు. కానీ ప్లాస్మా ద్వారా చికిత్స అందించినప్పటికీ.. యూసుఫ్ ప్రాణాలు దక్కలేదు.

Related Story: బక్రీద్ రోజున ఎస్సైకి కానిస్టేబుల్ ప్లాస్మా దానం.. మతసామరస్యానికి ప్రతీక

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.