యాప్నగరం

హైదరాబాద్‌లో సీఎం జగన్ ఇల్లు ముట్టడి

ఏపీలో హిందూ దేవాలయాలపై గత కొన్నిరోజులుగా వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడులపై బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చారు.

Samayam Telugu 23 Sep 2020, 2:17 pm
హైదరాబాద్‌లో ఉన్న జగన్ ఇంటిని ముట్టడించారు బజరంగ్‌దళ్ కార్యకర్తలు. ఏపీలో దేవలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాని నాని వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు. లోటస్ పాండ్‌లోని ఏపీ సీఎం జగన్ ఇంటిని బజరంగ్‌దళ్ కార్యకర్తలు ముట్టించారు. ఈ క్రమంలో పోలీసులకు బజరంగ్‌దళ్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Samayam Telugu ఏపీ సీఎం జగన్
ap cm jagan


Read More: మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు.. ఆస్తుల విలువ తెలిసి అధికారులే షాక్

మరోవైపు ఏపీలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్వేది రథం ఘటనతో అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గ ఆలయంలో కూడా అమ్మవారం రథంలో వెండి సింహాలు మామమయ్యాయి. పలు చోట్ల ఆలయాలు, దేవుడి విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలపై ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును అక్కడ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.