యాప్నగరం

కరోనా మృతుల అంత్యక్రియల విధానం దానికి విరుద్ధం: బండి సంజయ్

Telangana BJP: కరోనా సోకి మరణించిన వారికి జరపాల్సిన అంత్యక్రియల విధివిధానాలపై తెచ్చిన జీవో 169ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 13 Apr 2020, 12:23 am
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకిన వాళ్లల్లో ముస్లింలే ఎక్కువగా ఉన్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. దిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ వెళ్లి వచ్చిన ముస్లింలు కరోనా పరీక్షలకు సహకరించేలా ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చొరవ తీసుకోవాలని సూచించారు. చాలా చోట్ల మర్కజ్‌కు వెళ్లిన ముస్లింలు కరోనా టెస్టులకు సహకరించడం లేదని గుర్తు చేశారు. కరోనా సోకిన ముస్లింల కోసం అసదుద్దీన్ ఒవైసీ ఏ సహకారాలు అందిస్తున్నారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Samayam Telugu bandi


కరోనా సోకి మరణించిన వారికి జరపాల్సిన అంత్యక్రియల విధివిధానాలపై తెచ్చిన జీవో 169ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మార్గ నిర్దేశకాల్లో మరణించిన రోగుల అంత్యక్రియలకు కేవలం ఐదుగురినే అనుమతించడం హిందు మత ఆచారం ప్రకారం సరికాదని వివరించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ముస్లిం అనే పదాన్ని చేర్చకపోవడం విడ్డూరమని, దీని వెనుక ఆంతర్యమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. హిందూ ధర్మాలను పట్టించుకోకుండా జీవో తయారు చేశారని విమర్శించారు.

Must Read: undefined

రాష్ట్ర ప్రభుత్వం మతం పేరుతో జీవోలు విడుదల చేయడం తగదని అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఆదేశాల మేరకు ఈ జీవో జారీ అయితే, వెంటనే దాన్ని రద్దు చేయాలని అన్నారు. ఒకవేళ అధికారులు ఇలా చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ముస్లిం మతస్థుల ఖననానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.