యాప్నగరం

కేసీఆర్ పేరుకు కొత్త అర్థం చెప్పిన బండి సంజయ్..!

Bandi Sanjay: బండి సంజయ్.. పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్యర్థులపై పంచులు వేస్తూ.. కార్యకర్తల్లో జోష్ నింపుతారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసి ట్వీట్లు చేస్తున్న బండి.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ పేరుకు కొత్త అర్థం చెప్పారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 11 Aug 2022, 7:50 pm

ప్రధానాంశాలు:

  • కేసీఆర్ పేరుకు కొత్త అర్థం చెప్పిన బండి
  • కాసిం చంద్రశేఖర్ రిజ్వీ అంటూ ట్వీట్
  • తీవ్ర చర్చనీయాంశమైన బండి సంజయ్ ట్వీట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bandi Sanjay in Padayatra
పాదయాత్రలో బండి సంజయ్
Bandi Sanjay: ట్విట్టర్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు ఎప్పుడూ ఉంటుంది. టీఆర్ఎస్ కీలక నేతలపై బండి సంజయ్ పంచులు వేస్తే.. బండిపై కారు పార్టీ నేతలు సెటైర్లు వేస్తారు. కొత్త పేర్లు పెట్టుకుంటూ.. ఆయా పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపుతారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్.. తాజాగా కేసీఆర్ (KCR)పై సంచలన ట్వీట్ చేశారు. కేసీఆర్ పేరుకు కొత్త అర్థం చెప్పి.. బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
కేసీఆర్ అంటే.. 'కాసిం చంద్రశేఖర్ రిజ్వీ' అని కొత్త అర్థం చెప్పారు బండి సంజయ్. తన వైఫల్యాలను ప్రశ్నిస్తే జైల్లో పెడతారని వ్యాఖ్యానించారు. రామన్నపేటలో బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామయాత్ర (Praja Sangrama Yatra) కొనసాగుతోంది. ఈ సందర్భంగా.. కార్యకర్తల్లో జోష్ నింపడానికి బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలపై సెటైర్లు వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని.. వారిని కేసీఆర్ వెళ్లనివ్వాలని బండి సంజయ్ సవాల్ చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా.. విజయం బీజేపీదేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఓటు వేసి.. బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. పాదయాత్రలో బుధవారం ఆసక్తికర ఘటన జరిగింది. సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. ఓ అభిమాని వచ్చి ఆయనకు ముద్దు పెట్టారు. వెంటనే అలెర్ట్ అయిన బండి సెక్యూరిటీ సిబ్బంది.. ముద్దు పెట్టిన వ్యక్తిని పక్కకు నెట్టారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.