యాప్నగరం

పేపర్ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏ1గా బండి సంజయ్.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

తెలంగాణలో టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు.. ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను అరెస్ట్ చేయటంతో మరింత సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈరోజు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచేందుకు బండి సంజయ్‌ను వరంగల్‌కు తీసుకురాగా.. పోలీసులు రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. ఇందులో కీలక అంశాలు బయటపడ్డాయి. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో.. ఏ1గా బండి సంజయ్ పేరును పేర్కొనటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 5 Apr 2023, 5:33 pm

ప్రధానాంశాలు:

  • పేపర్ లీకేజీ కేసులో బిగ్ ట్విస్ట్
  • ఈ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరు
  • రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bandi sanjay
బండి సంజయ్
రాష్ట్రంలో సంచలనంగా మారిన టెన్త్ పేపర్ లీకేజీ కేసులో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అగ్గిరాజేస్తుంది. ఈ క్రమంలోనే.. ఆయనను మంగళవారం అర్థరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ నాటకీయ పరిణామాల మధ్య వరంగల్‌లోని న్యాయస్థానంలో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ క్రమంలోనే బండి సంజయ్‌కు సంబంధించిన రిమాండ్ రిపోర్టు బయటకు రాగా.. కీలక అంశాలు వెలుగు చూశాయి. పేపర్ లీకేజీ కేసులో నిన్నటివరకు ఏ-5గా పేర్కొన్న బండి సంజయ్ పేరును.. రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1గా పేర్కొన్నారు. ఏ2గా బూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5 మోతం శివగణేశ్, ఏ6 పోగు సురేశ్, ఏ7గా పోగు శంశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్ , ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా వసంత్‌ను పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రశాంత్ పేపర్ లీకేజ్ అయినట్లుగా వాట్సాప్‌లో ప్రచారం చేశారు. ప్రశాంత్ 10:41కి హిందీ పేపర్‌ను ఈటల రాజేందర్‌కు పంపించారు. అనంతరం 11:24 నిమిషాలకు బండి సంజయ్‌కి పేపర్‌ని పంపించారు. హిందీ పేపర్ వాట్సాప్‌లో పంపిన తర్వాత ప్రశాంత్ 149 మందితో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే బండి సంజయ్, ప్రశాంత్ ఇద్దరు కుట్రపన్నినట్లుగా పోలీసులు గుర్తించారు. 9 గంటల 30 నిమిషాలకు పేపర్ లీకేజ్ అయినట్లుగా ప్రశాంత్ వాట్సాప్ గ్రూప్‌లో తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. ఈ కేసులో మరి కొంతమంది కీలక సాక్షులను విచారించవల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్ష సూచన.. జాగ్రత్తగా ఉండండి..!
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.