యాప్నగరం

గణేష్ ఉత్సవాలకు అడ్డంకులా.. నిజాం పాలన గుర్తుకొస్తోంది: బండి సంజయ్

Ganesh Chaturthi 2020: గణపతి పూజలో పాల్గొన్న అనంతరం ఎంపీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశమంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలు సంతోషంగా నిర్వహించుకుంటుంటే సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.

Samayam Telugu 22 Aug 2020, 2:59 pm
వినాయక చవితి పర్వదినం సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కోవిడ్ నిబంధనల పేరుతో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించకుండా పోలీసులు అడ్డుంకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో జరిగిన వినాయక చవితి పూజల్లో సంజయ్ పాల్గొన్నారు. కరోనా నిబంధనల పేరుతో భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తనకు తెలిసిందని చెప్పారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
Samayam Telugu బండి సంజయ్
bandi sanjay


గణపతి పూజలో పాల్గొన్న అనంతరం ఎంపీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశమంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలు సంతోషంగా నిర్వహించుకుంటుంటే సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఈసారి గణపతి నవరాత్రి ఉత్సవాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. సీఎం కేసీఆర్ నిజాం పాలనను గుర్తుకు తెచ్చేలా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ వినాయక నవరాత్రి ఉత్సవాలను జరగనివ్వకుండా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.