యాప్నగరం

Huzurabad Bypoll: బండి సంజయ్ సంచలన నిర్ణయం.. ఆగస్టు 9 నుంచి..

Telangana BJP: ఏపీ-తెలంగాణ జల వివాదంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రణాళిక ప్రకారమే ఇద్దరు ముఖ్యమంత్రులు నీళ్ల సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని అన్నారు.

Samayam Telugu 4 Jul 2021, 3:35 pm
హుజురాబాద్‌ ఉప ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈయన ఆగస్ట్ 9 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌ నగరంలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి.. హుజురాబాద్‌లో ముగించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లుగా బండి సంజయ్ తెలిపారు. ఆదివారం ఆయన బీజేపీ కార్యాలయంలో వర్చువల్‌గా మాట్లాడారు.
Samayam Telugu బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
bandi sanjay


ఈ సందర్భంగా ఏపీ-తెలంగాణ జల వివాదంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రణాళిక ప్రకారమే ఇద్దరు ముఖ్యమంత్రులు నీళ్ల సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని అన్నారు. హుజురాబాద్‌లో రాజకీయ లబ్ధి కోసమే జగన్‌తో కేసీఆర్ రాజీపడ్డారని విమర్శించారు. కృష్ణానది జలాలు 50-50 అని కేసీఆర్ రాసిన లేఖ బూటకం అని కొట్టిపారేశారు.

కేసీఆర్ తీరు వల్లే తెలంగాణకు 575 టీఎంసీల రావాల్సిన చోట 299 టీఎంసీలకు పరిమితం చేశారని అన్నారు. కేసీఆర్ ఎన్ని కోట్లు పెట్టినా.. హుజురాబాద్‌లో గెలిచేది ఈటల రాజేందర్ మాత్రమేనని అన్నారు. చాలా సులభంగా బీజేపీ హుజురాబాద్‌లో గెలవబోతోందని అన్నారు. దుబ్బాక మాదిరిగానే బీజేపీ ఉత్సాహంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఒకటి, రెండు ఎన్నికల్లో ఓడినంత మాత్రానా వెనకడుగు వేసినట్లు కాదని, కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.