యాప్నగరం

బాలీవుడ్ పాటలో బతుకమ్మ, ఎంకన్న.. సోషల్ మీడియాలో వైరల్

1969లో వచ్చిన శత్రంజ్ సినిమాలో ఈ పాటను వింటే ఎవరైనాఆశ్చర్యపోతారు. ప్రముఖ గాయకుడు మొహమ్మద్ రఫీ ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా పాడారు.

Samayam Telugu 24 Oct 2020, 6:30 pm
తెలంగాణలో బతుకమ్మ పండగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిదిరోజుల పాటు ఈ పండగను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత వుంది. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం దీనిని అధికారికంగా జరిపుతుంది. దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ, బతకమ్మ పండుగ, గౌరి పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో పిలుస్తారు.
Samayam Telugu బాలీవుడ్‌ పాటలో బతుకమ్మ
bathukamm song in bollywood


మనందరీకి బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ అనే పాట బాగా తెలుసు... కానీ తెలంగాణలో ఎంతో ప్రాచుర్యం పొందిన ీ బతుకమ్మ అనే పదాన్ని 1969లోనే ఓ హిందీ పాటలో వినియోగించారు. 1969లో వచ్చిన 'శత్రంజ్' అనే హిందీ సినిమా వచ్చింది. అందులో .. 'బతుకమ్మ.. బతుకమ్మ.. ఎక్కడ పోతావ్ రా... ఎంకన్న ఎంకన్న.. ఇక్కడ రా' అంటూ సాగే ఈ పాట అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. అలనాటి ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ, శారదా రాజన్ ఈ పాటను అద్భుతంగా పాడారు. అప్పట్లో ప్రతి స్టేజ్‌పై ఈ పాట వినపడేది. ఈ పాటలో బాలీవుడ్ ప్రముఖ నటులు మెహమూద్, హెలన్ తన నటన, డాన్స్‌తో మరింత మెప్పించారు.

Read More: హైదరాబాద్‌లో మిల్క్ ఏటీఎం.. రాత్రి 10గంటల వరకు అందుబాటులో

సంగీత దర్శక ద్వయం శంకర్ - జై కిషన్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. వీరిలో శంకర్‌ హైదరాబాద్ వాసికావడంతో బతుకమ్మ, ఎంకన్న పేర్లను పాటలో ఉపయోగించి ఉంటారని అనుకుంటుంటారు. ఓ మ్యూజిక్ షోలో మహమ్మద్ రఫీ తదితరులు పాడగా.. ఆ అరుదైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.