యాప్నగరం

అఖిలప్రియ అరెస్టు వెనుక పెద్ద తలల స్కెచ్, భూములు కాదు.. భూమా మౌనిక సంచలనం

తన సొంత నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో మౌనిక రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మౌనిక మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 10 Jan 2021, 8:44 pm
హైదరాబాద్‌లో భూమా అఖిలప్రియ అరెస్టు వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని ఆమె సోదరి భూమా మౌనికా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే అఖిలప్రియను పోలీసులు, వైద్య సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అక్కను అరెస్టు చేస్తున్నట్లు కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించలేదని మౌనిక చెప్పారు. అరెస్టు సమయంలో ఆమె వెంట కనీసం లేడీ కానిస్టేబుల్ కూడా లేదని ధ్వజమెత్తారు.
Samayam Telugu భూమా సిస్టర్స్ (ఫైల్ ఫోటోలు)
Bhuma Akhila Reddy Sister Bhuma Mounika


తన సొంత నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో మౌనిక రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మౌనిక మీడియాతో మాట్లాడారు. ఇకపై కార్యకర్తలకు తాను అండగా ఉంటానని మౌనికా రెడ్డి హామీ ఇచ్చారు. ఈ అరెస్టు వ్యవహారం కేవలం హఫీజ్‌పేట్ భూముల వ్యవహారం గురించి మాత్రమే కాదని.. దాని వెనక చాలా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని మౌనికా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఒక్క సాక్ష్యం కూడా లేకుండా కోర్టులో హాజరుపరిచారని అన్నారు.

అఖిలప్రియ కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని, తెలంగాణ డీజీపీని కలిసి తమ పరిస్థితి వివరించినట్లు తెలిపారు. మరోవైపు న్యాయస్థానం ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి అఖిల ప్రియను జైలు అధికారులు రహస్యంగా ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌కు సంబంధించిన వాదనలు సికింద్రాబాద్ కోర్టులో జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.