యాప్నగరం

తెలంగాణలో భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే ?

నిన్నమొన్నటివరకు రెండువందలకు పైగా పెరిగిన చికెన్ ధరలు ఇప్పుడు అమాంతంగా తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనాలంటనే నాన్ వెజ్ ప్రియులు భయపడుతున్నారు.

Samayam Telugu 8 Jan 2021, 9:27 am
తెలంగాణలో చికెన్ ధరలు మరోసారి భారీగా తగ్గాయి. గతంలో కరోనా కారణంగా చికెన్ ధర కిలో రూ. 50 కూడా పలకలేదు. అయితే ఇప్పుడు మరోసారి బర్డ్ ఫ్లూ భయంతో మాంసం ప్రియులు చికెన్ కొనాలంటేనే భయపడుతున్నారు. నిన్నమొన్నటివరకు కిలో చికెన్ ధర రూ. 250పైగా ఉంది. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ భయంతో మరోసారి రాష్ట్రంలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో చికెన్ వ్యాపారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
Samayam Telugu భారీగా తగ్గిన చికెన్ ధరలు


నిన్నమొన్నటివరకు కరోనా కారణంగా పడిపోయిన చికెన్ వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంది. చికెన్ గుడ్లు తినాలని కేసీఆర్ స్వయంగా చెప్పడంతో చికెన్‌ అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగాయి. మళ్లీ ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ భయం వెంటాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌ లేకపోయినప్పటికీ... పక్క రాష్ట్రాల ప్రభావం భారీగానే ఉంది. పొరుగు రాష్ట్రాల్లోచికెన్‌ అమ్మకాలపై నిషేధాలు విధించడం... కోళ్లను చంపివేయడంతో రాష్ట్ర ప్రజలు సైతం చికెన్ తినేందుకు భయపడుతున్నారు. ఈ కొత్త వైరస్ సమయంలో చికెన్ తినకపోవడం మంచిదని భావిస్తున్నారు.

Read More: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక తేదీ ప్రకటన.. టీఆర్ఎస్‌లో టెన్షన్!

వారం క్రితం వరకు 250 రూపాయలపైనే ఉన్న కిలో చికెన్‌... ఇప్పుడు 180, 160 రూపాయలకు పడిపోయింది. పరిస్థితి ఇలానే ఉంటే.. ధరలు మరింత తగ్గుతాయంటున్నారు వ్యాపారులు. వారానికోసారి చికెన్‌ తినే నాన్‌వెజ్‌ ప్రియులు .. ఇప్పుడు అలా కూడా తినేందుకు భయపడుతున్నారు. బర్డ్‌ ఫ్లూ భయంతో చికెన్‌ అంటేనే భయపడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే చికెన్ అమ్మకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కోళ్లతో పాటు ఇతర పక్షులు, చేపల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.