యాప్నగరం

ప్రగతి భవన్‌ ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు

కార్పొరేటర్లుగా గెలిచి నెలరోజులు అవుతున్నా కూడా ఇంకా పాలకమండలి ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ప్రజలకు తాము ఏం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 5 Jan 2021, 2:13 pm
ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో పోలీసులకి , కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చేలరేగింది. నూతన పాలక మండలిని వెంటనే ఏర్పాటు చేయాలనీ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. తాము గెలిచి నెల రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు తమను ఎన్నుకుంటే , ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచామన్నారు.
Samayam Telugu ప్రగతి భవన్ ముట్టడి
pragathi bhavan


Read More: అవన్నీ ఊహాజనితమే.. టీపీసీసీ పదవిపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి అంటూ కార్పొరేటర్లు మండిపడ్డారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు , మేము ఎమన్నా రౌడీలమా అంటూ కార్పొరేటర్లు పోలీసుల్ని ప్రశ్నించారు. కెసిఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటివరకు టీఆర్ఎస్‌గా గెలిచిన కార్పొరేటర్లు సైతం ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇంకా కొత్త మేయర్ కూడా ఎన్నిక ఇంతవరకు జరగలేదు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.