యాప్నగరం

కీసర ఎమ్మార్వో లంచం కేసులో సీఎంవోకూ లింకు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Telangana BJP: ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అవినీతిపై జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణ చేపట్టాలని ఎన్వీఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామ‌ని ఆయన తెలిపారు.

Samayam Telugu 16 Aug 2020, 5:43 pm
కీసర ఎమ్మార్వో నాగరాజు రూ.కోట్లలో లంచం తీసుకున్న వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ స్పందించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, కొంతమంది ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతూ సర్కారు భూములను ప్రైవేటు సంస్థలకు కట్ట బెడుతున్నారని ఆయన విమ‌ర్శించారు. ఏసీబీ కేసుల్లో విచారణ సరిగా జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే అవినీతిలో భాగ‌స్వాముల‌వుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగులు లక్షలు, కోట్లలో లంచం తీసుకుంటున్నారంటే అందులో సీఎంవో అధికారులకు సంబంధం ఉందని ఆరోపణలు చేశారు.
Samayam Telugu ఎన్వీఎస్ ప్రభాకర్
nvs prabhakar


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫీస్‌లోని అధికారుల ఆదేశాల మేరకే ఎమ్మార్వోలకు పోస్టింగ్‌లు ఉంటున్నాయ‌ని తీవ్ర విమర్శలు చేశారు. అవినీతిలో సీఎంవో అధికారులకు, టీఆర్ఎస్‌లోని నాయకులకు పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అవినీతిపై జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణ చేపట్టాలని ఎన్వీఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామ‌ని ఆయన తెలిపారు.

Also Read: undefined

మరోవైపు, ఈ వ్యవహారంలో లంచం ఇవ్వజూపిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డి వద్ద అవినీతి నిరోధకశాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి సంబంధించిన ఫైళ్లు కనిపించినట్లు సమాచారం. ఇవి ఆయన ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు అని తెలుస్తోంది. ఏసీబీకి దొరికిపోయిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంజిరెడ్డి, రేవంత్‌ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నట్టు ఏసీబీ అధికారులు దీని ద్వారా ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Also Read: కీసర ఎమ్మార్వో లంచం కేసులో కొత్త ట్విస్ట్.. ఎంపీ రేవంత్ రెడ్డితో లింక్?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.