యాప్నగరం

Dubbaka By Election Result: దుబ్బాక తొలి రౌండ్‌లో బీజేపీ అధిక్యం

పోస్టల్ బ్యాలెట్‌తోనే కారు జోరు ప్రారంభంమైందని భావించారు. కానీ మొదటి రౌండ్‌లోనే టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. బీజేపీ ఆధిక్యం కనబర్చింది.

Samayam Telugu 10 Nov 2020, 9:36 am
దుబ్బాక ఉప ఎన్నికలో మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యింది. తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 341 ఆధిక్యంలో కనొసాగుతున్నారు. ఇకపోతే తొలి రౌండ్‌లో మొత్తం 7446 ఓట్లు లెక్కించారు. ఇందులో బీజేపీకి బీజేపీకి 3208 ఓట్లు, టీఆర్ఎస్‌కు 2867 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 648 ఓట్లు వచ్చాయి. సిద్దిపేట ఇందూరు కళాశాలలో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా 23 రౌండ్లలో ఓట్లలెక్కింపు ఉన్నప్పటికీ కౌంటింగ్ ప్రారంభమైన మొదటి గంటలో పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత్ లీడ్‌లో ఉన్నారు.
Samayam Telugu దుబ్బాకలో బీజేపీ ఆధిక్యం
bjp lead in dubbaka


Read More: Dubbaka By election result: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం

దుబ్బాక బరిలో ప్రధానంగా టిఆర్‌ఎస్ నుంచి సోలిపేట సుజాత రెడ్డి, బిజెపి నుంచి మాధవనేని రఘునందన రావు. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో విజేత ఎవరు, మెజారిటీ ఎంత అనే అంశం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇవిఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియపూర్తిగా సిసికెమెరాల్లో రికార్డు చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.