యాప్నగరం

మోత్కుపల్లి నర్సింహులకు కరోనా... పరిస్థితి విషమం

ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వారం రోజులుగా ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Samayam Telugu 18 Apr 2021, 10:51 am
మాజీ మంత్రి, బిజెపి నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కరోనా సోకిన ఆయనకు వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ నిర్థారణ కావడంతో వారం రోజుల క్రితం ఆయనను నగరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చేర్చారు. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగు కాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. దీంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోత్కుపల్లి


టీడీపీ హయాంలో మోత్కుపల్లి మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం అధినేత చంద్రబాబుతో విభేదించారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఎన్‌టీఆర్‌ ఘాట్‌ వద్ద సంచలన ప్రకటన చేసి టీడీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.