యాప్నగరం

విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 23 ఏళ్లు.. వెంకయ్య, అద్వానీలతో అప్పట్లో ఇలా..

Telangana BJP: సినీ నటిగా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె తొలుత బీజేపీలో చేరారు. ఆ తర్వాత సొంతంగా తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ పార్టీని విలీనం చేశారు.

Samayam Telugu 27 Jan 2021, 9:57 pm
సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి నిన్నటితో 23 సంవత్సరాలు అయ్యాయి. 23 ఏళ్లు పూర్తి చేసుకుని బుధవారం 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు. సరిగ్గా 23 ఏళ్ల క్రితం తాను బీజేపీలో చేరిన ఫోటోను ఆమె షేర్ చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ఓ ప్రెస్ మీట్‌లో ఉన్న ఫొటోను ఆమె పోస్టు చేశారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu వాజ్‌పేయీ, ఎల్‌కే అద్వానీ, వెంకయ్య నాయుడుతో విజయశాంతి
vijayashanthi old photos


సినీ నటిగా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె తొలుత బీజేపీలో చేరారు. ఆ తర్వాత సొంతంగా తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ పార్టీని విలీనం చేశారు. అలా టీఆర్ఎస్‌లో చేరి ఎంపీగా కూడా గెలిచారు. తర్వాత కేసీఆర్‌తో విభేదాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా పనిచేసిన విజయశాంతి.. ఇటీవలే తిరిగి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

‘‘రాజకీయాలలో నా ప్రయాణం ప్రారంభమై నిన్నటితో 23 సంవత్సరాలు (జనవరి 26, 1998) పూర్తయి 24వ సంవత్సరం మొదలైన సందర్భంగా నాకు అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసిన అభిమానులు మరియు శ్రేయోభిలాషులందరికీ వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆదరాభిమానాలను ఎప్పటికీ ఇలాగే నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. కృతజ్ఞతలతో మీ విజయశాంతి’’ అని ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.