యాప్నగరం

Vijayashanthi: 'నేను చెప్పినట్లే జరుగుతోంది.. కేసీఆర్ ఘనతకు ఇది నిదర్శనం'

Vijayashanthi: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళితబంధు పేరుతో ప్రజల్ని మభ్య పెడుతున్నారన్నారు. అది చాలదన్నట్లు బీఆర్ఎస్ ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఫైరయ్యారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 21 Jan 2023, 2:03 pm

ప్రధానాంశాలు:

  • కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
  • దళితబంధు పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపాటు
  • గత 10 నెలల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని ధ్వజం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vijayashanthi
విజయశాంతి
Vijayashanthi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పాలనాతీరును ఎండగట్టారు. తెలంగాణలో టీఆరెస్ నుంచి బీఆరెస్‌కి ఎదిగిన కేసీఆర్ గారి సర్కారు సాధించిన ఘనతకు మీడియాలో వచ్చిన కథనం నిదర్శనమంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఫేస్‌బుక్ హ్యాండిల్లో జోడించారు. దేశం మొత్తాన్ని ఉద్ధరించేస్తామంటూ డబ్బా కొట్టుకుంటున్న కేసీఆర్ గారు... కేవలం ఎన్నికల ప్రయోజనం కోసమే తెలంగాణలో ప్రవేశపెట్టిన దళిత బంధులొని డొల్లతనాన్ని మీడియా బట్టబయలు చేసిందన్నారు.
'బడ్జెట్‌లో మాత్రం రూ.17,700 కోట్లు కేటాయించి.. గత 10 నెలల్లో రూపాయి కూడా తియ్యలేదు. ఒక్కరికి కూడా ఈ పథకం అమలు కాలేదు. ఇది చాలక బీఆరెస్‌కి పగ్గాలిస్తే దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామంటూ దొంగ హామీలిస్తున్నరు. ఇదంతా దళితులను మభ్యపెట్టడం, మోసపుచ్చడం కాక ఇంకేమిటి ? కేసీఆర్ సర్కారు ఊదరగొడుతున్న ఈ దళితబంధులు, రైతుబంధులు చివరికి బంద్ అవుతాయని నేను గతంలో పలుమార్లు చెబుతూనే వచ్చాను. చివరికి ఆదే జరుగుతోంది. అని సోషల్ మీడియా వేదికగా విజయశాంతి మండిపడ్డారు.

Badradri: కొత్తగూడెం యువకుడితో ప్రధాని మోదీ మాట - మంతి
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.