యాప్నగరం

నిరుద్యోగ భృతిపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు.. కొత్త లాజిక్ తెర మీదకు!

2018 ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు నిరుద్యోగ భృతిని అమలు చేయడానికి టీఆర్ఎస్ సర్కారు సన్నద్ధం అవుతోంది. ఈ విషయమై మంత్రి కేటీఆర్ సంకేతాలిచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు.

Samayam Telugu 29 Jan 2021, 9:56 am
తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. త్వరలోనే నిరుద్యోగ భృతిని అందించనుంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటన చేస్తారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 2018 ఎన్నికల ముందు నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3016 చొప్పున భృతి చెల్లిస్తామని టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. రెండేళ్లు గడిచినా.. ఈ హామీ నెరవేరకపోవడంతో.. నిరుద్యోగుల్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఇది గమనించిన అధికార పార్టీ నిరుద్యోగ భృతి అమలు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.
Samayam Telugu vijayashanthi-kcr


ఈ విషయమై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం.. ఇప్పటికే ప్రభుత్వం ఒక్కొక్కరికి సుమారు రూ.75 వేలు బాకీ పడిందన్నారు. ముందు ఆ మొత్తం చెల్లించి తర్వాత మిగతా ముచ్చట్లు చెప్పాలని రాములమ్మ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని గారడీ కార్యక్రమంలా ప్రారంభించొద్దని హితవు పలికారు. అలా చేస్తే నిరుద్యోగుల తిరుగుబాటు, ఉద్యమాలను ఎదుర్కోవడానికి తెలంగాణ సర్కారు సిద్ధపడాల్సి రావొచ్చన్నారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీలలో బీజేపీ గెలుపు ఫలితాలతోనే ఇంత కదలిక కనబడుతున్నదంటే... రానున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక, కార్పోరేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టిగా కర్రు కాల్చి ఈ కారు సర్కారుకు ఇంకొంత వాత పెడితే మరికొంత చలనం కలిగే అవకాశం ఉండచ్చని విజయశాంతి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.