యాప్నగరం

ఒక్క కిలో కొనలేదు.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఈటల సవాల్

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కిలో వడ్లు కూడా కొనలేదు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. ధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Samayam Telugu 25 Apr 2022, 9:56 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ సహచరుడు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క కిలో ధాన్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనలేదని.. కేంద్రమే బియ్యం రూపంలో రైతుల ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. ఒక్క కిలో కొనుగోలు చేసినట్లు నిరూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు.
Samayam Telugu rajender
ఈటల రాజేందర్


కేసీఆర్ సర్కార్ తీరు సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా ఉందని ఈటల ఎద్దేవా చేశారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తున్నానని గొప్పలు చెబుతున్నాడని.. ఆ కోటి ఎకరాల్లో పండించిన పంటను ఎలా కొనాలో ఆలోచనలేని వ్యక్తి కేసీఆర్ అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతు వేదికలు, శ్మశానవాటికలు కేంద్ర నిధులతోనే నిర్మించారని.. నేడు రైతు వేదికలు ప్రారంభానికి నోచుకోకుండా ధావత్‌లకు అడ్డాలుగా మారిపోయాయని ఆయన అన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. హుజూరాబాద్ స్ఫూర్తితో రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీని గెలిపించుకోవాలన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.