యాప్నగరం

అనర్హులకు ఆర్థిక సాయం...రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరారు రాజా సింగ్. వరదల్లో నష్టపోయిన వారికి నష్టం అంచనా వేసి పరిహారం అందించాలన్నారు.

Samayam Telugu 2 Nov 2020, 12:27 pm
హైదరాబాద్‌లో వరద బాధితులకు అందుతున్న సాయంపై ఘోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో 10 వేల ఆర్థిక సహాయం అనర్హులకు కూడా ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ ఎంఐఎం వాళ్లు వాతావరణం చెడుగొడుతున్నారన్నారు. Ghmc ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని తెలిపారు. పాత బస్తీలో ఇళ్ళు ఇంకా నీటిలోనే ఉన్నాయన్నారు. నష్టపోయిన వారికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజా సింగ్.
Samayam Telugu ఎమ్మెల్యే రాాజాసింగ్
mla raja singh


ప్రభుత్వం అందిస్తున్న పదివేల సాయం ఓ గోడకు రంగులు వేసుకోవడానికి కూడా సరిపోవన్నారు. ఎవరికి ఎంత నష్టం జరిగిందో వారికి అంత డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కుంటలు అమ్ముకున్నవారిపై కూడా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకు కాలనీలు నీట మునిగాయి.దీంతో వరద బాధితుల కోసం కేసీఆర్ సర్కార్ రూ.550 కోట్లను విడుదల చేసింది. వరద బాధితులకు రూ. 10వేల సాయం అందించింది.

Read More:హైదరాబాద్ సీపీ నా పేరు లాగుతున్నారు: బీజేపీ నేత వివేక్
మరోవైపు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వరద బాధితులు ఆందోళనలకు దిగుతున్నారు. తమకు సాయం అందడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. కార్పొరేటర్లు, నాయకుల ఇళ్ల ఎదుట ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.