యాప్నగరం

తెలంగాణలోనూ ఎన్ఆర్‌సీ.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

అసోంలో అమలు చేస్తున్న జాతీయ పౌర రిజిస్టర్‌ను తెలంగాణలో కూడా అమలు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ, శనివారం ట్వీట్ చేశారు.

Samayam Telugu 31 Aug 2019, 5:26 pm
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోం రాష్ట్రంలో అమలు చేస్తున్న జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)ని తెలంగాణలోనూ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కూడా ప్రస్తావించారు. తన ఓటు బ్యాంకు కోసం హైదరాబాద్ ఎంపీ బంగ్లాదేశీయులకు, రోహింగ్యాలకు తెలంగాణలో చోటు కల్పిస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu Raja singh22


‘హైదరాబాద్ ఎంపీ, తన ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీయులకు, రోహింగ్యాలకు తెలంగాణలో చోటు కల్పిస్తున్నారు. అసోంలో అమలు చేసిన ఎన్‌ఆర్‌సీని తెలంగాణలో కూడా అమలు చేయండి. వచ్చే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఎన్ఆర్‌సీని అమలు చేయాలని హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని రాజాసింగ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా ట్యాగ్ చేశారు.
Read Also: రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: బోడకుంటిundefined
అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ) తుది జాబితాను కేంద్రం శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మొత్తం 3,11,21,004 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొన్నారు. మొత్తం 19,06,657 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు.

జాబితాలో చోటు లేని వారికి భారత్‌లోని ఉన్నత న్యాయస్థానాలతోసహా చట్టపరంగా అన్ని వినతులకు అవకాశం కల్పించినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు జాబితాలో లేని వారికి జిల్లా న్యాయ సేవల యంత్రాంగం (డీఎల్ఎస్ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన న్యాయ సహాయం అందించాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.