యాప్నగరం

Satya kumar: ఒక్కరినైనా బీఆర్ఎస్‌లోకి లాక్కోగల్గితే ముక్కునేలకు రాస్తా..

Satya kumar: కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో విపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ నేతలు ఏకంగా సవాళ్లు విసురుతున్నారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆసక్తికర సవాల్ విసిరారు. ఏపీలోని బీజేపీ నుంచి ఏ ఒక్కకార్యకర్తనైనా బీఆర్ఎస్‌లోకి లాక్కోగల్గితే.. ముక్కు నేలకు రాస్తానని ట్విట్టర్ వేదికగా.. ఛాలెంజ్ చేశారు. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ సవాల్ ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 4 Oct 2022, 4:49 pm
Satya kumar: గులాబీ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న సందర్భంలో.. విపక్ష పార్టీల నాయకులు విమర్శలకు పదును పెట్టారు. అందులో బీజేపీ నాయకులైతే.. విరుచుకుపడుతున్నారు. ముందు నుంచి నిప్పు ఉప్పులా ఉంటున్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు.. ఈ సమయంలో మరింత దూకుడుగా మాటల యుద్ధం చేస్తున్నారు. ఇదే క్రమంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (KCR) బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ (Satya kumar) ఆసక్తికర సవాల్ విసిరారు. ఏపీ బీజేపీ నుంచి ఏ ఒక్కరినైనా బీఆర్ఎస్‌ (BRS)లోకి లాక్కోగలిగితే.. ముక్కు నేలకు రాస్తానని ఛాలెంజ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రేపే కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావం అంటూ ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని కూడా జత చేశారు. బీజేపీ నుంచి తీసుకోలేరు కానీ.. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి వస్తారేమో ప్రయత్నించమని సలహా సైతం ఇచ్చారు. ఒకరో ఇద్దరో దొరుకుతారంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
Samayam Telugu satya kumar
సత్య కుమార్


"ఏపీలో ఏ ఒక్క బీజేపీ కార్యకర్తనన్నా మీరు పెట్టబోతున్న BRS (Bharata Bar & Restaurant Samiti) పార్టీలోకి లాక్కోగలిగితే ముక్కు నేలకు రాస్తా. మీరు పుట్టిన కాంగ్రెస్ (Congress), పెరిగిన టీడీపీ (TDP), తోడు దొంగ వైసీపీ (YCP)తో ట్రై చేసుకోండి ఒకరో ఇద్దరో తలమాసినోళ్లు దొరక్కపోరు." అంటూ సత్యకుమార్ ట్వీట్ చేశారు.

మరోవైపు.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి హమాలీలకు కోళ్లు, మద్యం పంపిణీ చేయటంపై కూడా సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్, బార్ అండ్ రెస్టారెంట్ సమితి.. కొత్త పాలసీ ఇదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్, కేటీఆర్ దార్శనికతకు అభినందనలంటూ.. దెప్పిపొడిచారు. ఇలాంటి నాయకులకు కేంద్రంలో అధికారం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండని ప్రజలకు సూచించారు. "హర్ నాల్ సే జల్" పథకాన్ని కాస్తా " హర్ నాల్ సే ఆల్కాహాల్" గా మార్చేస్తారని సత్యకుమార్ విమర్శించారు.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.