యాప్నగరం

‘ఇది ట్రైలర్ మాత్రమే.. టీఆర్ఎస్‌కి అసలు సినిమా ముందుంది’

TelanganaBJP | తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

Samayam Telugu 6 Aug 2019, 6:12 pm
తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు సంబంధించి మంగళవారం (ఆగస్టు 6) ఆయన నల్లగొండ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదుకు తెలంగాణలో భారీగా ఆదరణ పెరిగిందని తెలిపారు. బీజేపీ సభ్యత్వాల నమోదును చూసి, టీఆర్ఎస్ గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయినీ, ఆ పార్టీ నుంచి చాలా మంది నేతలు బీజేపీలో చేరడానికి సంప్రదిస్తున్నారని తెలిపారు.
Samayam Telugu bjp


ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, టీఆర్‌ఎస్‌కి అసలు సినిమా ముందు ముందు చూపిస్తామని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పార్టీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరడం ఖాయమని లక్ష్మణ్ తెలిపారు.

చరిత్ర తిరగరాసిన రోజు..

కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ స్పందించారు. ఆర్టికల్ 370,35ఏల ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే కుట్ర పూరిత చర్యలతో 70 ఏళ్లుగా కశ్మీర్ రావణకాష్టంలా తయారైందని విమర్శించారు. రూ. 50 లక్షల కోట్లు ఖర్చు చేసినా కశ్మీర్ అభివృద్దికి నోచుకోలేదన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా పరిశ్రమలు నెలకొల్పబడి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశ ప్రజలు నరేంద్ర మోదీని అభినవ సర్దార్‌ అంటూ ప్రశంసిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దయిన ఆగస్టు 5వ తేదీ చరిత్ర తిరగరాసిన రోజు అని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.